Wrinkles Removing Tips: ఈ విటమిన్ వాడితే ముఖంపై ముడతలు పోయి కళకళలాడే చర్మం మీ సొంతం అవుతుంది

Skin Care Tips: అంతర్గత ఆరోగ్యమే కాదు..బాహ్య సౌందర్యం కూడా చాలా అవసరం. చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యం ఎప్పటికప్పుడు కాపాడుకోవల్సి ఉంటుంది. దీనికోసం అద్భుతమైన చిట్కాలున్నాయి. ఈ చిట్కాను రోజూ పాటిస్తే..చర్మం నిగనిగలాడటం ఖాయం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2023, 01:19 PM IST
Wrinkles Removing Tips: ఈ విటమిన్ వాడితే ముఖంపై ముడతలు పోయి కళకళలాడే చర్మం మీ సొంతం అవుతుంది

Wrinkles Removing Tips:Vitamins: చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యం కోసం విటమిన్ ఇ అద్భుతంగా దోహదపడుతుంది. ఎందుకంటే విటమిన్ ఇ అంటే యాంటీ ఏజీయింగ్ సాధనమని చెప్పవచ్చు. ముఖంపై ముడతల్ని పోగొట్టి నిత్య యౌవనంగా చేస్తుంది. ఆ వివరాలు మీ కోసం..

అందం, నిగనిగలాడే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే చాలామంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు లేదా చికిత్సపై ఆధారపడుతుంటారు. కానీ మార్కెట్‌లో లభించే ఈ వస్తువులన్నీ హాని కల్గించేవే. చర్మానికి నష్టం కల్గిస్తాయి. ఈ క్రమంలో ముఖానికి విటమిన్ ఇ అప్లై చేసే విధానం గురించి తెలుసుకుంటే అద్భుత ఫలితాలు చూడవచ్చు. దీంతో హైపర్ పిగ్మంటేషన్ తగ్గుతుంది. విటమిన్ ఇలో ఉండే యాంటీ ఏజీయింగ్ గుణాలతో ముడతలు దూరమౌతాయి. నిత్య యౌవనంగా ఉంచుతుంది. 

విటమిన్ ఇ క్యాప్స్యూల్‌తో ముడతలు ఎలా దూరం చేయడం

రోజూ చర్మానికి విటమిన్ ఇ అప్లై చేయడం ప్రారంభిస్తే మీ ముఖంపై ముడతలు తొలగిపోతాయి. దీనికోసం రోజూ నిద్రపోయే ముందు ముఖానికి విటమిన్ ఇ మస్సాజ్ చేయాలి. రోజూ క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ముడతలు మాయమౌతాయి.

బాదం నూనె

బాదం నూనెలో కూడా విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతల్ని తొలగించి యౌవనంగా చేస్తుంది. బాదం నూనెలో న్యూట్రియంట్లు కూడా ఉండటం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

బీట్‌రూట్

బీట్‌రూట్ రసాన్ని క్లీన్సర్‌లా ఉపయోగించవచ్చు. బీట్‌రూట్ రసాన్ని తీసి ముఖానికి బాగా రాసుకోవాలి. కాస్సేపటి తరువాత ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ ముఖంపై పింక్ గ్లో వస్తుంది. 

అల్లోవెరా

అల్లోవెరాను ముఖానికి మాయిశ్చరైజర్‌లా వినియోగించాలి. అల్లోవెరా చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యానికి నిజంగా అద్భుతమైన ఔషధం అనడంలో వేరే సందేహం అనవసరం. దీంతో ముఖంపై ముడతలే కాకుండా చర్మ సమస్యలన్నీ దూరమౌతాయి. మీ ముఖంపై నిగారింపు కూడా వచ్చి చేరుతుంది. 

Also read: Diabetes: మధుమేహం నియంత్రించాలంటే..ఈ 5 పండ్లు డైట్‌లో ఉండాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News