Soaked Dry Fruits Losses Weight in 9 Dyas: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఆహారాలు తీసుకుంటేనే శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. ప్రతి రోజూ ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సీజనల్ మారడం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజూ ఎలాంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ డ్రైఫ్రూట్స్ శరీర బరువుకు చెక్...
ఎండుద్రాక్ష:
ఎండుద్రాక్ష శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ఐరన్, ప్రొటీన్, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి నానబెట్టి ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలోని బలహీనత తొలగిపోవడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటి నుంచి మంచి ఫలితాలు పొందడానికి కేవలం ఖాళీ కడుపుతో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ ఎండు ద్రాక్షను తినాలంటే ప్రతి రాత్రి 6 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత తినాలి.
బాదం:
బాదంలో ఉండే గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడాని సహాయపడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించి.. బాడీకి పోషకాలను అందిస్తుంది. అయితే ఇందులో ప్రొటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగడమేకాకుండా బరువు కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఎండు ఖర్జూరాలు:
ఖర్జూరం పోషకాల నిధిగా ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి రాత్రిపూట నీటిలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో ఐరన్ పరిమాణం పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి శరీర బరువు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఖాళీకడుపుతో వీటిని తినడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook