Sprouted Peas: మొలకెత్తిన పెసలు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

Sprouted Peas For Body Weight: మొలకెత్తిన పెసల్లను ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి ఇంకెన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2023, 10:43 AM IST
Sprouted Peas: మొలకెత్తిన పెసలు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

Sprouted Peas For Body Weight: భారతదేశ వ్యాప్తంగా పెసర పప్పుకు మంచి డిమాండ్‌ ఉంది. పెసల్లను క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వీటిని సలాడ్స్‌లో తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో తాజాగా మొలకెత్తిన పెసల్లు కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. వీటిని ఆయుర్వేద నిపుణులు సూపర్‌ ఫుడ్‌గా పిలుస్తారు. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో మొలకెత్తిన పెసలను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా పెంచుతాయి. అయితే వీటిని ప్రతి రోజు అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మొలకెత్తిన పెసల్ల వల్ల కలిగే లాభాలు:
శరీర బరువును పెంచేందుకు..

సన్నగా ఉన్నారని బాధపడేవారు ప్రతి రోజు ఉదయం అల్పాహారంలో భాగంగా మొలకెత్తిన పెసలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెసల్లలో అధిక పరిమాణంలో పోషకాహారం, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి బరువు పెరగాలనుకునేవారు ప్రతి రోజు సలాడ్స్‌లో ఈ మొలకెత్తిన పెసల్లను తీసుకోవాల్సి ఉంటుంది. 

జీర్ణక్రియ సమస్యలకు చెక్‌:
మొలకెత్తిన పెసల్లను తినడం వల్ల సంక్లిష్ట పోషకాలు సరళమైన పదార్థాలుగా మారుతాయి. దీని కారణంగా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాల ఎంజైమ్‌లు లభిస్తాయి. ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల పొట్ట సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

రక్తహీనతను తగ్గిస్తుంది:

మొలకల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ప్రతి రోజు వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా రక్తహీనత సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. తరచుగా రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు మొలకెత్తిన పెసల్లను ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది. 

రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గిస్తుంది:
మొలకెత్తిన పెసల్లలో  వైటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే యాంటీఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి:
ఈ  పెసల్లలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ బి, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఎముకలు కూగా దృఢంగా మారుతాయి. 

Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News