Tea For Weight Loss In 6 Days: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల కఠినతర వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ బరువు తగ్గడానికి ఔషధ గుణాలున్న టీలు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి. ముఖ్యంగా ఈ క్రమంలో ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రమంలో పలు ఔషధ గుణాలు టీలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పొట్ట చుట్టూ పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. అయితే దీని కోసం ఎలాంటి టీలు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గించే టీలు ఇవే:
దాల్చిన చెక్క టీ:
దాల్చిన చెక్కలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలుంటాయి. అయితే దీనిని పొడిలా తయారు చేసి టీలాగా చేసుకుని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఇందులో ఉండే గుణాలు బరువు తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ముఖ్యంగా పొట్ట సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గడానికి తప్పకుండా ఈ టీని తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
సోపు టీ:
సోపులో పొట్టకు మేలు చేసే చాలా రకాల గుణాలు ఉంటాయి. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఈ టీని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం ఒక కప్పు టీలో ఒక చెంచా సోపును వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించి తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అయితే ఈ టీని క్రమం తప్పకుండా 3 నుంచి 4 సార్లు తీసుకుంటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
జీలకర్ర టీ:
జీలకర్ర టీ శరీరానికి చాలా మంచిది. ఒక చెంచా జీలకర్ర గింజలను తీసుకుని నీటిలో వేసి మరించి.. టీలాగా సర్వ్ చేసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రుచి ఇందులో నాలుగు చుక్కల నిమ్మరసం వేసుకుని తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. సులభంగా బరువు తగ్గుతారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook