Natural Sunscreens: ఇంట్లో దొరికే ఈ 3 ఖరీదైన సన్‌స్క్రీన్ కంటే మెరుగు..

Natural Sunscreens:  ఎండాకాలం దంచికొడుతోంది. ఆరోగ్య జాగ్రత్తలతోపాటు సౌందర్యపరంగా కూడా సరైన సంరక్షణ ఎంతో అవసరం. సూర్యుని హానికర కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ముఖంపై ఎండ వల్ల కలిగే హాని అంతా ఇంతా కాదు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 10, 2024, 05:22 PM IST
Natural Sunscreens: ఇంట్లో దొరికే ఈ 3 ఖరీదైన సన్‌స్క్రీన్ కంటే మెరుగు..

Natural Sunscreens:  ఎండాకాలం దంచికొడుతోంది. ఆరోగ్య జాగ్రత్తలతోపాటు సౌందర్యపరంగా కూడా సరైన సంరక్షణ ఎంతో అవసరం. సూర్యుని హానికర కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ముఖంపై ఎండ వల్ల కలిగే హాని అంతా ఇంతా కాదు. బయటకు వెళ్లే ముందు ముఖంపై మాస్క్ వంటివి ధరించాలి. ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిది. అయితే, ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. డబ్బు చూస్తే ముఖం డ్యామేజ్ అవ్వడం పక్కా కానీ, ఇంట్లో ఉండే ఓ మూడు వస్తువులు ఖరీదైన సన్‌స్క్రీన్ కంటే మెరుగ్గా పనిచేస్తుందట. అంతేకాదు ముఖ ఛాయను కూడా రెట్టింపు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

బట్టర్..
మన చర్మాన్ని హానికర యూవీ కిరణాల నుంచి రక్షించుకోవడనానికి బట్టర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది సహజ సన్‌స్క్రీన్. ఇది అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. కోకో బట్టర్ మాయిశ్చరైజర్ మాత్రమే కాదు సహజ సన్‌స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. ఎండలో బయటకు వెళ్లినప్పుడు కోకోబట్టర్‌ను ముఖానికి రాసుకోండి. చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సూర్యకిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది.

ఇదీ చదవండి: శరీర బరువును తగ్గించే ఎఫెక్టివ్ లెమన్ టీ రెసిపీని ఇలా తయారు చేసుకోండి..  

షియా బట్టర్.. 
ఇంట్లో ఉండే మరో సహజ సన్‌స్క్రీన్ షియా బట్టర్. ఇది కూడా సన్‌స్క్రీన్ మాదిరి పనిచేస్తుంది. మీ చర్మానికి ఓ రక్షణ షీల్డ్‌ మాదిరి పనిచేస్తుంది. ఎండలోకి వెళ్లినప్పుడు మీ వద్ద సన్‌స్క్రీన్ ఉండాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే సహజ షియా బట్టర్ ను ముఖానికి రాసుకుని వెళితే సరిపోతుంది. ఇది సూర్యుడి హానికర బ్యాక్టిరియా నుంచి మన చర్మానికి కాపాడుతుంది. అంతేకాదు, షియా బట్టర్ ముఖానికి మెరుపు పెంచుతుంది. 

ఇదీ చదవండి: ఈ ఎర్రని కూరగాయతో యూరిక్ యాసిడ్ సమస్య రాత్రికిరాత్రే మాయమవుతుంది..

నువ్వుల నూనె..
నువ్వుల నూనెతో ముఖం మెరుపు పెరుగుతుంది. అందుకే ఇంటి రెమిడీల్లో దీన్ని వాడతారు. దీంతో ముఖవర్చస్సు పెరుగుతుంది. అయితే, సహజ సన్‌స్క్రీన్ మాదిరి కూడా నువ్వుల నూనె పనిచేస్తుందంటే మీరు నమ్ముతారా? అవును, ఇది మీ ఇంట్లో ఉండే సహజ సన్‌స్క్రీన్ వందలు ఖర్చు పెట్టి సన్ స్క్రీన్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు. ఎండకు మీరు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లైట్‌గా ముఖంపై నువ్వుల నూనెను అప్లై చేసుకోండి. ఇది హానికర యూవీ కిరణాల నుంచి మీ చర్మాన్ని కాపాడుతుంది. మీ చర్మం డ్యామేజ్ అవ్వకుండా ఎండ నుంచి రక్షిస్తుంది. మీ ముఖానికి నేచురల్ గ్లో ఇస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News