Muskmelon: ఖర్బూజా శరీరానికి ఎంతో మేలు.. దీని ఇలా తయారు చేసుకోడం వల్ల ఎన్నో లాభాలు..

Benefits Of Muskmelon: ఖర్బూజా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2024, 11:12 PM IST
Muskmelon: ఖర్బూజా శరీరానికి ఎంతో మేలు.. దీని ఇలా తయారు చేసుకోడం వల్ల ఎన్నో లాభాలు..

Benefits Of Muskmelon: ఖర్బూజా  ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి.  ఖర్బూజాలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో చలువను అందిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండే ఖర్బూజా రక్తంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.అంతే కాకుండా ఫైబర్ పుష్కలంగా ఉండే ఖర్బూజా జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. 

బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఖర్బూజా కంటి చూపును మెరుగుపరచడానికి రాత్రి పూట చూపు సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఖర్బూజా చర్మాన్ని యువ యువత్వంగా ఉంచడానికి మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఈ విధంగా  ఖర్బూజా  మనకు ఎంతో సహాయపడుంది. ఈ ఖర్భూబా నేరుగా తినడం ఇష్టం లేని వారు దీని జ్యూస్‌గా చేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. దీని కోసం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు సరిపోతాయి. అంతేకాకుండా దీని పిల్లలు, పెద్దలు తీసుకోవచ్చు. దీని వేసవిలో తీసుకోవడం ఎంతో ఉత్తమనమని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు. 

ఖర్బూజా జ్యూస్ తయారీ విధానం

*కావలసిన పదార్థాలు 

* 1 పండు ఖర్బూజా ముక్కలు 

* నిమ్మరసం 

* చక్కెర 

* పుదీనా ఆకులు 

* మంచు ముక్కలు 

తయారీ విధానం:

1. ఖర్బూజా ముక్కలను శుభ్రంగా కడగండి. 

2. మిక్సర్ జార్‌లో ఖర్బూజా ముక్కలు, కావాలంటే నిమ్మరసం, చక్కెర, పుదీనా ఆకులు వేసి మెత్తగా పొడి చేయండి. 

౩. ఈ ముక్కలను మిక్స్‌లో పట్టుకొని జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. 

4. ఈ విధంగా జ్యూస్‌ తయారు అవుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. 

మీరు కూడా ఈ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. జ్యూస్‌ను మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. మీరు పిల్లలు, పెద్దలు దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యలాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే బయట తయారు చేసిన  ఆహార పదార్థాలు, డ్రింక్స్‌ను తీసుకోకుండా ఉండాలి. బయట తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం అనారోగ్య సమస్యల బారిన పడుతుంది. దీని వల్ల నష్టం కలుగుతంది కాబట్టి పిల్లలు , పెద్దలు ఇంట్లో సహాజంగా తయారు చేసిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ జ్యూస్‌ను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News