Uses Of Apple: లైంగిక శక్తిని పెంచడంలో యాపిల్ జ్యూస్‌ ప్రయోజనాలు ఇవే!

Benefits Of Taking Apple Everyday: యాపిల్ పండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతిరోజు యాపిల్ తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 12:24 PM IST
Uses Of Apple: లైంగిక శక్తిని పెంచడంలో యాపిల్ జ్యూస్‌ ప్రయోజనాలు ఇవే!

Benefits Of Taking Apple Everyday: యాపిల్‌ పండులో అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఐరన్‌, ఫాస్పరస్‌, కాల్షియం, విటమిన్ ఏ ఇతర పోషకాలు దొరుకుతాయి.  దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండాఉంటామని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే యాపిల్ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్‌ పండును తీసుకోవడం వల్ల మలబద్ధం వంటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. యాపిల్ తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సులువుగా డైజెస్ట్ అవుతుంది. దీని వల్ల మలబద్ధ సమస్య తగ్గుతుంది.

మహిళల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. దీనికోసం మందులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఒక యాపిల్‌ తీసుకోవడం వల్ల ఐరన్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ఈ యాపిల్‌ను జ్యూస్‌గా చేసి కూడా తాగవచ్చు. ఈ జ్యూస్‌ వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

యాపిల్‌ చిన్న పిల్లలకు వచ్చే విరేచనాలను కూడా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక చెంచా ఆపిల్ జ్యూస్‌ తాగించడం వల్ల ఈ సమస్య బారిన పడకుండా ఉంటారు.

కొంతమంది గుండెల్లో మంట, పుల్లని తేనుపులు, అజీర్తి, గ్యాస్‌ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనెను కలుపుకుని తాగుతే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు యాపిల్‌ను తినడం వల్ల తరచూ వచ్చే జ్వరాలు తగ్గుతాయి.

మూత్రంలో మంట, కడుపులో మంటగా ఉంటే యాపిల్ జ్యూస్  తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

బీపీ సమస్యలతో బాధపడేవారు ఆపిల్ తీసుకోవడం వల్ల ఇందులోని క్యాల్షియం, పొటాషియం ఉండటం వల్ల సమస్య తగ్గుతుంది.

Also Read  Teeth Whitening Naturally: ఈ చిట్కాలను పాటించడం వల్ల తెల్లటి దంతాలు మీ సొంతం!

మెదడు వ్యాధులు, నాడీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు యాపిల్‌ జ్యూస్‌ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండు వల్ల యాక్టిల్ చోలిన్ ఉత్పత్తి పెంచడంలో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది.

కామెర్ల సమస్యతో బాధపడున్నవారు యాపిల్‌ జ్యూస్‌ తాగడం వల్ల సమస్య తగ్గుతుంది.

కఫంతో బాధపడుతున్నవారు యాపిల్‌ పండును తీసకోవడం వల్ల తర్వాత సమస్య నుంచి బయటపడుతారు.

యాపిల్‌ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

ఆపిల్ జ్యూస్ లైంగిక శక్తిని పెంచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read  Jaggery Benefits: బెల్లాన్ని ప్రతిరోజు తింటే శరీరానికి ఎన్ని లాభాలు కలుగుతాయి తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News