Match Box in Rice: బియ్యం డబ్బాలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా?

Match Box in Rice: సాధారణంగా స్టవ్ వెలిగించాలంటే అగ్గిపెట్ట ఉపయోగిస్తాం. ఇంట్లో హఠాత్తుగా కరెంటు పోయినా దీని కోసమే వెతుకుతాం. ఇంకా ఎన్నో విధాలుగా అగ్గిపెట్ట మన నిత్యజీవితంలో ఉపయోగపడుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 22, 2024, 10:59 PM IST
Match Box in Rice: బియ్యం డబ్బాలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా?

Match Box in Rice: సాధారణంగా స్టవ్ వెలిగించాలంటే అగ్గిపెట్ట ఉపయోగిస్తాం. ఇంట్లో హఠాత్తుగా కరెంటు పోయినా దీని కోసమే వెతుకుతాం. ఇంకా ఎన్నో విధాలుగా అగ్గిపెట్ట మన నిత్యజీవితంలో ఉపయోగపడుతుంది. మరి అగ్గిపెట్టను బియ్యం డబ్బాలో పెడితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

వంటింట్లో బియ్యం ఎప్పటికీ నిల్వ చేసుకునే ఆహార ధాన్యం. నెలకు సరిపడా లేదా ఏడాదికి సరిపడా కూడా కొంతమంది నిల్వ చేసుకుంటారు. కానీ, బియ్యంలో పురుగుపడుతుంది. దీనికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ, పురుగుపడుతుంది. అయితే, ఆ బియ్యం డబ్బాలో ఖాళీ అగ్గిపెట్టను ఉంచితే ఈ సమస్య ఉండదని మీకు తెలుసా?

ఇదీ చదవండి: Oral Care: మీ పళ్లను ఇలా కేవలం 2 నిమిషాల్లో ముత్యాల్లా మెరిపించేయండి..

సాధారణంగా మనం అగ్గిపుల్లలు అయిపోగానే అగ్గిపెట్టను చెత్తబుట్టలో పారేస్తాం. ఈసారి అలా చేయకండి. ఇలా బియ్యం డబ్బాలో ఆ ఖాళీ అగ్గిపెట్టను వేసేయండి. ఎందుకంటే అగ్గిపెట్టల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది కీటకాలను దూరంగా ఉంచుతుంది. దీంతో బియ్యం డబ్బాలో పురుగు చేరకుండా ఉంటుంది. బియ్యం డబ్బా మాత్రమే కాదు ఇతర పప్పుల్లో కూడా మీరు ఇలా ఖాళీ అగ్గిపెట్ట బాక్సును పెట్టేయండి. ఆ దరిదాపుల్లో కూడా పురుగులు రావాలంటే భయపడతాయి. అగ్గిపెట్ట మాత్రమే కాదు పలావు ఆకు, లవంగాలను కూడా బియ్యం నిల్వ చేసే డబ్బాలో వేసి పెట్టుకోవాలి. వీటికి కూడా పురుగులకు వికర్షకంగా పనిచేస్తాయి. సాధారణంగా ఈ పురుగులు తేమకు త్వరగా ఆకర్షితమవుతాయి.

ఇదీ చదవండి: Premature Greying Hair: ఖర్చు లేకుండా తెల్లజుట్టును ఇలా నల్లగా మార్చుకోండి!

అగ్గిపెట్ట కాకుండా వాటిలో ఉండే అగ్గిపుల్లలను కూడా ఇలా బియ్యం డబ్బాలో వేసుకోవచ్చు. అయితే, ఆ బియ్యం డబ్బాను గాలి చొరబడకుండా మూత గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పడు బియ్యం డబ్బాను పురుగుపట్టకుండా తనిఖీ చేస్తూ ఉండాలి. 

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News