Salman Khan vs Nani: నాని కలెక్షన్స్ లో సగం కూడా రాబట్టలేకపోయిన సల్మాన్..ఇంతకన్నా అవమానం ఉందా?

Kisi ka Bhai Kisi ka Jaan Collections vs Dasara Collections: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్, నాని నటించిన దసరా సినిమా కలెక్షన్స్ మధ్య ఆసక్తికరమైన కంపారిజన్ తెర మీదకు వచ్చింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 23, 2023, 11:19 AM IST
Salman Khan vs Nani: నాని కలెక్షన్స్ లో సగం కూడా రాబట్టలేకపోయిన సల్మాన్..ఇంతకన్నా అవమానం ఉందా?

Salman Khan Collects Less than Half of Nani's Dasara: ఈ మధ్యకాలంలో ఒక్క హీరోతో మరో హీరోని లేదా సమంత లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న హీరోయిన్లతో మీడియం రేంజ్ హీరోలను కంపేర్ చేస్తున్న దాఖలాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన కంపారిజన్ తెర మీదకు వచ్చింది, అదేమిటంటే సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ మొత్తానికి స్టార్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమా చేసిన మినిమం గ్యారంటీగా టికెట్లు అమ్ముడుపోతూ ఉంటాయి.

తాజాగా ఆయన కిసీకా భాయ్ కిసీకా జాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈద్ అంటే రంజాన్ కి ఒక రోజు ముందు శుక్రవారం నాడు ఏప్రిల్ 21వ తేదీన ఈ సినిమా ఘనంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా సౌత్ సినీ పరిశ్రమకు చెందిన మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించాడు. దీంతో ఈ సినిమా సల్మాన్ ఖాన్ కెరియర్ లో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఈ సినిమా గురించి అనేక అంచనాలు పెట్టుకున్నారు.

Also Read: Crow Sentiment: బలగం-విరూపాక్ష సినిమాలల్లో ఈ కామన్ పాయింట్ చూశారా? డబ్బే డబ్బు!

అయితే ఈ సినిమా కేవలం మొదటి రోజు 15 కోట్ల 81 లక్షల మాత్రమే వసూలు చేసింది. సల్మాన్ ఖాన్ కెరియర్ లో గత పదేళ్ల నుంచి గనుక మనం చూస్తే ఇలాంటి దారుణమైన కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. అయితే అదే సమయంలో టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో ఒకరిగా చెప్పబడుతున్న నాని సినిమా వసూళ్ల గురించి కంపేర్ చేస్తున్నారు. నాని ఈ మధ్యనే దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. కానీ తెలుగులో వచ్చినన్ని వసూళ్లు ఇతర భాషల్లో రాలేదని చెప్పాలి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నాని దసరా సినిమా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా మాత్రం అందులో సగం గ్రాస్ వసూళ్లు కూడా రాబట్ట లేక పోయింది. దీంతో సల్మాన్ ఖాన్ సినిమా కంటే నాని సినిమానే బెటర్ అని సల్మాన్ ఖాన్ సత్తా కంటే నాని సత్తానే బెటర్ అని ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇలా కంపేర్ చేయడం కాస్త ఇబ్బందికరమైన అంశమే అయినా మరి ఈ విషయంలో మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి....

Also Read: Pawan Fan Murderd: పవన్‌ కల్యాణ్‌ అభిమానిని కొట్టి చంపిన ప్రభాస్‌ ఫ్యాన్‌..ఇదేం శాడిజం అయ్యా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News