/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Amazing Facts About Indian Railways: మన దేశంలో ప్రయాణానికి ఎక్కువగా ఉపయోగించేది రైళ్లనే.. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లు ట్రైన్ జర్నీకే ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి రోజు మన దేశంలో 40 మిలియన్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లలో చాలా రకాలు ఉంటాయి. ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, డెమో, రీసెంట్‌గా వందేభారత్ ఇలా వివిధ రకాల రైళ్లను మనం చూస్తున్నాం. అయితే రైళ్లలో ఇలా రకరకాల ట్రైన్స్ ఎందుకు ఏర్పాటు చేశారు..? వీటి మధ్య తేడా ఏంటి..? ఎంత వేగంతో ప్రయాణిస్తాయి..? పూర్తి వివరాలు ఇలా.. 

సూపర్ ఫాస్ట్ రైలు

సూపర్ ఫాస్ట్ రైలు గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే ఈ ట్రైన్‌కు స్టాపులు తక్కువగా ఉంటాయి. అయితే ఈ రైళ్ల ఛార్జీలు మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ రైళ్లు ఎక్కువగా దూరాల్లో రాకపోకలు సాగిస్తూ ఉంటాయి.

ఎక్స్‌ప్రెస్ రైలు

సూపర్‌ఫాస్ట్ రైళ్ల కంటే.. ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ మెయిల్ రైళ్ల కంటే వేగంగా నడుస్తాయి. ఈ రైళ్ల సగటు వేగం సాధారణంగా 55 కి.మీ ఉంటుందని అధికారులు అంటున్నారు. స్టేషన్ల విషయంలో కూడా సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతి చోట ఆగవు. ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు చేరుస్తుంది. 

మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు

గతంలో కొన్ని రైళ్లలో పోస్ట్ బాక్స్ ఉండేది. ఈ పోస్ట్ బాక్స్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉత్తరాలు, పొట్లాలను పంపేవారు. అందుకే ఆ రైళ్లకు మెయిల్ ఎక్స్‌ప్రెస్ అని పిలిచేవారు. అయితే ప్రస్తుతం రైళ్లలో పోస్ట్ బాక్స్‌లను తొలగించారు. అయినా ఆ రైళ్లను ఇప్పటికీ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైలు అని పిలుస్తున్నారు. ఈ రైళ్ల సగటు వేగం గంటకు 50 కి.మీ ఉంటుంది. ఈ రైళ్లు చాలా స్టేషన్లలో ఆగుతాయి. 

Also Read: Indian Railways: రైల్వే కోచ్‌లపై ఈ నంబరుకు అర్థం తెలుసా..! ఇక ఈజీగా చెప్పేయండి

ప్యాసింజర్ రైలు

ప్యాసింజర్ రైళ్లు తక్కువ దూరంలో నడుస్తాయి. అన్ని స్టేషన్లలో స్టాపింగ్ ఉంటుండంతో సగటు వేగం చాలా తక్కువగా ఉంటుంది. సింగిల్ ట్రాక్ ఉన్నప్పుడు వేరే ట్రైన్లకు క్లియరెన్స్ ఇవ్వడం కోసం స్టేషన్లలో ప్యాసింజర్ రైళ్లను నిలిపేస్తారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కొంచెం ఆలస్యం ఉంటుంది.  

Also Read: IPL Latest Updates: కమ్‌బ్యాక్ కింగ్స్.. ఈ సీజన్‌లో రెచ్చిపోతున్న సీనియర్ ప్లేయర్లు..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Section: 
English Title: 
railway facts in telugu different categories of trains in indian railway
News Source: 
Home Title: 

Railway Facts: ఈ రైళ్ల మధ్య తేడా తెలుసా..! ఏ ట్రైన్ ఎంత స్పీడ్‌తో వెళుతుందంటే..?
 

Railway Facts: ఈ రైళ్ల మధ్య తేడా తెలుసా..! ఏ ట్రైన్ ఎంత స్పీడ్‌తో వెళుతుందంటే..?
Caption: 
Indian Railway News (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Railway Facts: ఈ రైళ్ల మధ్య తేడా తెలుసా..! ఏ ట్రైన్ ఎంత స్పీడ్‌తో వెళుతుందంటే..?
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Wednesday, April 26, 2023 - 09:00
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
43
Is Breaking News: 
No
Word Count: 
286