Indian Railways: రైల్వే కోచ్‌లపై ఈ నంబరుకు అర్థం తెలుసా..! ఇక ఈజీగా చెప్పేయండి

Indian Railway Interesting Facts: మీరు రైలు ఎక్కేప్పుడు కోచ్‌పై ఉన్న ఐదు అంకెల నంబరును గమనించే ఉంటారు. అయితే ఆ నంబరుతో మనకు పనిలేదు కాబట్టి పెద్దగా పట్టించుకోని ఉండరు. కానీ ఆ నంబరు గురించి తెలిస్తే.. ఆ కోచ్‌లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో ఇట్టే చెప్పేయొచ్చు.    

Written by - Ashok Krindinti | Last Updated : Apr 25, 2023, 07:59 AM IST
Indian Railways: రైల్వే కోచ్‌లపై ఈ నంబరుకు అర్థం తెలుసా..! ఇక ఈజీగా చెప్పేయండి

Indian Railway Interesting Facts: మనం నిత్యం రైళ్లలో ప్రయాణిస్తున్నా.. పెద్దగా గమనించని అనేక విషయాలు ఉన్నాయి. రైలు పెట్టెలు, ఇంజిన్లపైనా.. రైలు చివరనా అనేక నంబర్లు, కోడ్‌లు రాసి ఉంటాయి. మనం జస్ట్ ఆ నంబర్లు చూసి ఏదో అనుకుంటాం. ఆఫ్ కోర్స్ ఆ నంబర్లతో మనకు పెద్దగా ఉపయోగం కూడా లేదనుకోండి. కానీ నంబర్లపై వెనుక ఓ సమాచారం ఉంటుంది. ఇది అందరికీ అర్థం కాదు. ఈ నంబర్లు గురించి మనం ఎవరినీ అడిగినా నాక్కూడా తెలియదనే సమాధానమే వినిపిస్తుంది. రైలు కోచ్‌లపై రాసిన నంబర్‌ను ఓసారి డీకోడ్ చేద్దాం..

రైలు కోచ్‌పై ఐదు అంకెల సంఖ్య ఉంటుంది. ఇందులో మొదటి 2 అంకెలు.. ఆ కోచ్ ఏ సంవత్సరంలో తయారు చేశారో తెలియజేస్తుంది.  మిగిలిన 3 సంఖ్యలు ఆ కోచ్‌లు ఏ గ్రూప్‌కు చెందినవో తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక కోచ్‌పైనా 98397 నంబరు ఉంటే.. అది 1998 సంవత్సరంలో తయారు చేశారని అర్థం. 13328 అని ఉంటే.. అది 2013లో తయారైందని సూచిస్తుంది. 328 నంబరు స్లీపర్ కోచ్‌ను సూచిస్తుంది. 05497 నంబరు ఉంటే.. 2005లో ఆ కోచ్ తయారైందని అర్థం. చివరి మూడు అంకెలు 397 కోచ్ స్లీపర్ క్లాస్ అని తెలియజేస్తుంది. 328, 397 అంటే స్లీపర్ కోచ్ ఎలా అని మీకు డౌట్ రావొచ్చు. రైల్వేలో సౌకర్యాల ఆధారంగా.. వారి క్రమ సంఖ్యలు కేటాస్తారు. ఏసీ ఫస్ట్ క్లాస్ 001-025 వరకు నంబర్లు కేటాయించారు. ఆ తర్వాత సౌకర్యాలు తగ్గితే.. వాటి క్రమ సంఖ్య పెరుగుతుంది. ఈ కింద ఇచ్చిన నంబర్ల ఆధారంగా మీరు నంబరును బట్టి ఏ కోచ్ అని ఈజీ తెలుసుకోవచ్చు.

Also Read: CM KCR Speech: నేను కథలు చెప్పటం లేదు.. కళ్ల ముందు జరుగుతున్న చేదు నిజాలు: సీఎం కేసీఆర్

రైళ్లలో సౌకర్యాల ప్రకారం క్రమ సంఖ్య..

==> 001-025 : ఏసీ ఫస్ట్ క్లాస్
==> 026-050 : కాంపోజిట్ 1ఏసీ + ఏసీ-2T
==> 051-100 : ఏసీ-2T
==> 101-150 : ఏసీ-3T
==> 151-200 : సీసీ (ఏసీ చైర్ కార్)
==> 201-400 : స్లీపర్ (2వ తరగతి)
==> 401-600 : GS (జనరల్ 2వ తరగతి)
==> 601-700 : 2S (2వ తరగతి సిట్టింగ్/జన శతాబ్ది చైర్ క్లాస్)
==> 701-800 : సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్
==> 801 + : ప్యాంట్రీ కార్, జనరేటర్ లేదా మెయిల్

Also Read: SRH Vs DC Highlights: ఇంట్రెస్టింగ్ సీన్.. భువనేశ్వర్ కాళ్లు పట్టుకున్న డేవిడ్ వార్నర్..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News