Kishan Reddy On ORR Tenders: తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. కిషన్ రెడ్డి వార్నింగ్

Hyderabad Outer Ring Road Tenders Issue: ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో భారీ అవినీతి జరుగుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎలాగూ అధికారంలోకి రాలేమని బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 7, 2023, 05:26 PM IST
Kishan Reddy On ORR Tenders: తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. కిషన్ రెడ్డి వార్నింగ్

Hyderabad Outer Ring Road Tenders Issue: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు టెండర్ వివాదం ముదురుతోంది. ఈ విషయంపై ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండగా.. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ స్పందించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ బంగారు బాతు అని.. కేసీఆర్ కుటుంబం ఈ బంగారు బాతును చంపేస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియపై సీబీఐ విచారణకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. హైదరాబాద్ నగరం చుట్టూ వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తామని తెలిపారు. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. బాధ్యులు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 

ఓఆర్ఆర్ టెండర్‌లో ఐఆర్‌బీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్  కంపెనీకి రింగ్ రోడ్డు బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందన్నారు కిషన్ రెడ్డి. 30 ఏళ్ల నిర్వహణకు 7,380 కోట్ల రూపాయలు చెల్లించిందని తెలిపారు. అయితే ఇప్పటికే ఈగల్ ఇన్ ఫ్రా అనే కంపెనీ ఏడాదికి రూ.415 కోట్లు చెల్లించి టోల్ వసూలు చేస్తుందని.. ఏడాదికి ఐదు శాతం పెంచుకుంటు వెళ్లినా 30 ఏళ్లకు హెచ్ఎండీఏకు 30 వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు. 

అదే ఏడాదికి 10 శాతం పెంచితే.. 30 ఏళ్లలో హెచ్ఎండీఏకు రూ.75 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 15 శాతం అభివృద్ధి లెక్కిస్తే.. వచ్చే 30 ఏళ్లలలో 2 లక్షల 7 వేల 887 కోట్ల రూపాయలు ఆదాయంగా వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వెనకేసుకుందామని చూస్తోందని అన్నారు. ప్రతీ ఏటా ఓఆర్ఆర్‌పై ఆదాయం పెరగడం తప్ప తగ్గడం ఉండదని.. ఎక్కడకు వెళ్లాలన్నా అవుటర్ రింగ్ రోడ్డునే ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఆదాయానికి ఎందుకు తక్కువ చేసి కాంట్రాక్టు కుదుర్చుకున్నారని నిలదీశారు. 

"హైదరాబాద్ జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ఓఆర్ఆర్‌పై అంచనాలకు మించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జాతీయ రహదారులను కేంద్రం అద్భుతంగా నిర్మిస్తోంది. బిడ్‌లో ఎంపికైన ఐఆర్‌బీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ వెబ్ సైట్‌ను పరిశీలిస్తే.. ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ కూడా వాళ్లకే వచ్చింది. కానీ వాళ్ల వెబ్‌సెట్‌లో టెండర్ చాలా తక్కువ చేసి చూపిస్తున్నారు. ముంబై-పుణే ఎక్స్ ప్రెస్ వే ను ఈ కంపెనీకి కేవలం  10 ఏళ్ల 2 నెలలకు మాత్రమే ఇచ్చారు. దానికి ఈ 10 ఏళ్ల కోసం అక్కడి ప్రభుత్వానికి అందే ఆదాయం 8 వేల 875 కోట్ల అయితే.. మనది 30 ఏళ్లకు 7 వేల 380 కోట్లు మాత్రమే. బిడ్ వేసే ముందు సెక్షన్ 1.13 ప్రకారం .. బేస్ వాల్యూ ప్రకటించాలి. కానీ ఎందుకు ప్రకటించలేదు.." అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News