Thurum Khanlu : తెలంగాణ నేటివిటీతో తురుమ్‌ఖాన్‌లు.. నవ్వించేందుకు రెడీ

Thurum Khanlu Movie Updates తెలంగాణ నేటివిటీతో వస్తోన్న సినిమాలిప్పుడూ బాగానే సక్సెస్ అవుతున్నాయి. జాతిరత్నాలు, బలగం వంటి సినిమాలు తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించేలా చేశాయి. ఇప్పుడు ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2023, 03:42 PM IST
  • నెట్టింట్లో తురుమ్‌ఖాన్‌ల సినిమా సందడి
  • చివరి షెడ్యూల్‌లో తురుమ్‌ఖాన్‌లు చిత్రం
  • తెలంగాణ నేటివిటీతో మరో సినిమా?
Thurum Khanlu : తెలంగాణ నేటివిటీతో తురుమ్‌ఖాన్‌లు.. నవ్వించేందుకు రెడీ

Thurum Khanlu Shoot Completed తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా కథలను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడి మట్టి కథలను, ఇక్కడి నేపథ్యంలో వస్తున్న పల్లె కథలు బాక్సాఫీస్ వద్ద బాగానే సక్సెస్ అవుతున్నాయి. ఇదే తరహా తెలంగాణ పల్లె కథతో తురుమ్ ఖాన్‌లు అనే సినిమా రాబోతోంది. స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో  రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. శంషాబాద్‌లో జరిగిన ఆఖరి షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది.

మొదటి సారిగా మహబూబ్ నగర్  ఏరియా, అక్కడి స్లాంగ్‌లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రంలో దాదాపు 90 శాతం కొత్త నటీనటులే నటించారు. చిత్ర దర్శకుడు శివకళ్యాణ్ మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా తెలుగులో ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డైలాగ్ రైటర్‌గా పని చేశానని అన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టు తెలిపాడు. తనను, తన కథని నమ్మిన నిర్మాత ఆసిఫ్ జానీకి ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని అన్నాడు. 

ఈ ఆదునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టీపెరిగీ సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు, ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు అనే కాన్సెప్ట్‌తో తీశామని చెప్పుకొచ్చాడు. నిర్మాత ఆసిఫ్ జానీ మాట్లాడుతూ.. బలమైన కథ, సహజమైన పాత్రలు ఉన్న ఈ చిత్రాన్ని క్వాలిటీగా రూపొందించామని తెలిపాడు. ఎక్కడా, ఏ మాత్రం కాంప్రమైజ్ అవలేదని చెప్పుకొచ్చాడు.

Also Read:  Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. మా రాఘవుడి కథే రామాయణం.. ఆ ఒక్కటే మైనస్

సినిమా  అనుకున్న దానికంటే బాగా వచ్చిందని నిర్మాత తెలిపాడు. ఈ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలని, భారీ  ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది  చిన్న సినిమాగా రిలీజ్ అవుతుందని.. ఒకసారి ప్రేక్షకులకు చేరువైన తర్వాత వారే దీన్ని పెద్ద సినిమా చేస్తారనే నమ్మకం ఉందని నిర్మాత చెప్పుకొచ్చాడు.

Also Read:  HBD Sai Pallavi : నీ చెల్లిగా పుట్టినందుకు నేను లక్కీ.. మిస్ అవుతున్నా.. సాయి పల్లవి సిస్టర్ స్పెషల్‌ విషెస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News