Passport Big Alert: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు జారీ

Passport Big Alert: పాస్‌పోర్ట్. ప్రతి దేశం ఆ దేశ నాగరికుడిగా గుర్తిస్తూ ఇచ్చే అతి ముఖ్యమైన కీలకమైన డాక్యుమెంట్. ఏ దేశానికి వెళ్లాలన్నా కావల్సింది ఇదే. పాస్‌పోర్ట్ లేనిదే విదేశీ ప్రయాణం సాధ్యం కాదు. పాస్‌పోర్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త సూచనలు జారీ చేస్తుంటుంది. ఇవి తెలుసుకోవడం చాలా అవసరం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2023, 01:13 PM IST
Passport Big Alert: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికలు జారీ

Passport Big Alert: పాస్‌పోర్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎలర్ట్ జారీ చేసింది. పాస్‌పోర్ట్ హోల్డర్లు ఈ ఆలర్ట్ తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే డబ్బులు వృధా అవడమే కాకుండా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన ఈ అలర్ట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వివరాలు మీ కోసం.

పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేవారు, పాస్‌పోర్ట్ కావాలనుకునేవారికి ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన ఈ సూచనలు తెలుసుకోకపోతే చాలా ఇబ్బందుల్లో పడతారు. ఇటీవలే నాలుగురోజుల క్రితం పాస్‌పోర్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. పాస్‌పోర్ట్ సేవలు పొందే క్రమంలో నకిలీ వెబ్‌సైట్స్, నకిలీ మొబైల్ అప్లికేషన్స్ బారిన పడవద్దని హెచ్చరిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవల పేరుతో చాలా వరకూ నకిలీ వెబ్‌సైట్స్, నకిలీ మొబైల్ అప్లికేషన్లు అందుబాటులో ఉండి..డేటా సేకరించడమే కాకుండా భారీగా ఫీజుల వసూలు చేస్తున్నాయి. వీటి బారిన పడవద్దని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 

పాస్‌పోర్ట్ సేవల పేరుతో కొన్ని నకీలీ వెబ్‌సైట్లు, నకిలీ మొబైల్ యాప్స్ ప్రజల నుంచి డేటా సేకరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆ సేవలకు సంబంధించి అప్పాయింట్‌మెంట్లు కూడా నిర్ధారిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇందులో కొన్ని నకిలీ వెబ్‌సైట్లు డొమైన్ నేమ్ ఓఆర్జీ పేరుతో మరికొన్ని ఇన్ పేరుతో, ఇంకొన్ని డాట్ కామ్ పేరుతో ఉన్నాయి. అందుకే పాస్‌పోర్ట్ కావాలనుకునేవారు ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్ల జోలికి వెళ్లవద్దని అప్రమత్తం చేస్తోంది. 

నకిలీ వెబ్‌సైట్ల పేర్లు ఇవే

1. www.indiapassport.org
2. www.online-passportindia.com
3. www.passportindiaportal.in
4. www.passport-india.in
5. www.passport-seva.in
6. www.applypassport.org

భారతీయ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే పౌరులు పొరపాటున కూడా ఈ నకిలీ వెబ్‌సైట్స్ జోలికి వెళ్లవద్దని, ఏ విధమైన చెల్లింపులు జరపవద్దని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. లేకపోతే డబ్బులు నష్టపోవడమే కాకుండా ఇతర సమస్యలు కూడా ఎదుర్కోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టెర్నల్ ఎఫైర్స్ జారీ చేసే భారతీయ పాస్‌పోర్ట్ సేవల కోసం కేవలం ఒకే ఒక అధికారిక వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. ఆ వెబ్‌సైట్ ఇదే..www.passportindia.gov.in. ఇక పాస్‌పోర్ట్ సేవల కోసం ప్రభుత్వ అధికారిక యాప్ కూడా ఉంది. ఈ మొబైల్ యాప్ పేరు mPassport Seva. ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also read: Pan Card Updates: మీ పాన్ కార్డు దుర్వినియోగమైందో లేదో ఎలా తెలుసుకోవడం, ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News