ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల: ఎన్టీఆర్ మళ్లీ దిగొచ్చాడా అన్నట్టుగా కనిపించిన బాలయ్య బాబు

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల

Last Updated : Aug 14, 2018, 08:34 PM IST
ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల: ఎన్టీఆర్ మళ్లీ దిగొచ్చాడా అన్నట్టుగా కనిపించిన బాలయ్య బాబు

స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులకు గుడ్ న్యూస్. ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో మేకర్స్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. తెలుగు వారి కీర్తిని ప్రపంచం నలుమూలలకు చాటిచెప్పిన ఎన్టీ రామారావు రియల్ స్టోరీతో రూపొందుతున్న సినిమా కావడంతోపాటు ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తుండటంతో ఎన్టీఆర్ బయోపిక్‌పై మొదటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టుగానే ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం ఎన్టీఆర్ బయోపిక్‌పై ఆసక్తిని రెట్టింపు చేసింది. గతంలో బాలయ్య బాబు-క్రిష్ కాంబోలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి బ్లాక్‌బస్టర్ హిట్ అవడం కూడా ఎన్టీఆర్ బయోపిక్‌పై అంచనాలు పెంచడానికి ఓ కారణమైంది.

 

ఇదిలావుంటే, తాజాగా విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌లో ఎన్టీఆర్‌గా బాలయ్య బాబుని చూస్తోంటే, అభిమానుల అంచనాలకు తగినట్టుగానే క్రిష్ ఈ చిత్రాన్ని మల్చుతున్నాడని స్పష్టమవుతోంది. అచ్చం ఎన్టీఆర్‌నే చూస్తున్నామా అన్నట్టుగా ఉన్న ఫస్ట్ లుక్ స్టిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 

Trending News