Road accident in Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రావెల్ లారీ అదుపుతప్పి గుడిపైకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
పూర్తి వివరాల్లోకి వెళితే...
ఇవాళ తెల్లవారుజామున తొండంగి మండలంలో గ్రావెల్ లారీ బీభత్సం సృష్టించింది. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపు వెళ్తున్న లారీ.. అదుపుతప్పి ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీకొట్టి పక్కనే ఉన్న వినాయకుడి గుడిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్(28), క్లీనర్ కోనూరు నాగేంద్ర(23)తోపాటు గుడిలో నిద్రిస్తున్న సోము లక్ష్మణరావు (48) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు శేఖర్, నాగేంద్రలను ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో వినాయకుడి ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Also Read: Heat Wave alert: ఏపీ వాసులకు అలర్ట్.. ఇవాళ, రేపు కూడా మాడు పగిలేలా ఎండలు..
దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. తరుచూ ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్షం, అతి వేగం, నిద్రమత్తులో ఉండి నడపటం, మద్యం మత్తులో డ్రైవ్ చేయడం వల్ల రోజూ ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
Also Read: Odisha Train Accident News: 316 మంది ఏపీ వాసులు సేఫ్.. ఆ 141 మంది కోసం సెర్చింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి