Athimadhuram Powder Benefits: ఆయుర్వేద శాస్త్రంలో పూర్వీకులు గొప్ప గొప్ప ఔషధ మూలికల గురించి వివరించారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించే చాలా రకాల ఔషధ మూలికలను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువగా వినియోగించే మూలికల్లో అతి మధురం వేరు ఒకటి. ఈ వేరులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ వేరును చూర్ణంలా చేసి వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అతి మధురం వేరును గ్లైసరీసా గాబ్రా అనే శాస్త్రీయ నామంతో కూడా పిలుస్తారు. దీనిని వినియోగించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు రెండు గ్రాముల అతి మధురం వేరు చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా దీనిని నీటిలో వేసుకొని పుక్కిలించి ఊమడం వల్ల నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
అతి మధురం వేరు చూర్ణాన్ని వినియోగించడం వల్ల కలిగే లాభాలు ఇవే:
ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల ప్రస్తుతం చాలామంది దగ్గు జలుబు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు అతి మధురం వేరుతో తయారుచేసిన చూర్ణాన్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా సులభంగా పొడి దగ్గు సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
చర్మ సమస్యలతో బాధపడే వారికి కూడా అతి మధురం వేరు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చర్మం పై మొటిమలు మచ్చలు ఉన్నవారు అతి మధురం వేరు చూర్ణాన్ని మిశ్రమంలో తయారుచేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి నీటితో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చర్మ సమస్యలు తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది.
అతి మధురం వేరు తో తయారు చేసిన పొడిని ప్రతిరోజు తేనెలో కలుపుకొని తీసుకోవడం వల్ల యాసిడిటీ సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా గొప్ప ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే వారు తప్పకుండా ఈ అతి మధురం వేరు చూర్ణాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
Also read: Hair Mask: డేండ్రఫ్ సమస్యను సమూలంగా తొలగించే హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook