How To Remove White Hair Naturally: వాతావరణ కాలుష్యం, శరీరంలో పోషకాహార లోపం కారణంగా చాలామందిలో జుట్టు పెరగడం ఆగిపోతోంది. అంతేకాకుండా నల్ల జుట్టు తెల్లగా మారుతోంది. ఇలా ఒక్కటి రెండు కాకుండా చాలా రకాల జుట్టు సమస్యలకు దారితీస్తోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన హెయిర్ మాస్కులను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని జుట్టు పెరగడమే కాకుండా.. తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు మృదువుగా కూడా మారుతుంది. తరచుగా జుట్టు సమస్యలతో బాధపడేవారు హెన్నా, టీ పౌడర్ తో తయారు చేసిన మాస్క్ ను క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. ఈ హెన్నా, టీ పౌడర్ మాస్క్ ను ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవే:
✺ నాలుగు టీ స్పూన్ల హెన్నా
✺ రెండు టీ స్పూన్ల టీ తో తయారు చేసిన మిశ్రమం
✺ రెండు టీ స్పూన్ల కోడిగుడ్డు లోపలి మిశ్రమం
మాస్క్ తయారీ పద్ధతి:
✺ ఈ మాస్క్ ను తయారు చేయడానికి ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
✺ ఆ తర్వాత ఆ గిన్నెలో హెన్నా ఈ ఆకుల నుంచి తయారుచేసిన మిశ్రమాన్ని వేయాలి.
✺ ఇలా వేసిన రెండింటిని బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
✺ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె, మరో టీ స్పూన్ కోడిగుడ్డు లోపలి సోనాను అందులోనే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
✺ ఆ తర్వాత ఒక డబ్బాలో భద్రపరచుకుంటే హెన్నా టీ లీఫ్ హెయిర్ మాస్క్ తయారైనట్లే.
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఈ మాస్క్ ను జుట్టుకు ఎలా అప్లై చేయాలో తెలుసా?:
✺ ఈ మాస్క్ ను అప్లై చేయడానికి ముందు తప్పకుండా హెడ్ బాత్ చేయాల్సిందే.
✺ ఆ తర్వాత జుట్టును బాగా పొడి పొడిలా ఆరనివ్వాలి.
✺ ఇలా చేసిన తర్వాత జుట్టుకు ఈ హెయిర్ మాస్కును అప్లై చేయాలి.
✺ అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
✺ ఇలా పూర్తిగా ఆరిపోయిన జుట్టును సాధారణ షాంపుతో శుభ్రం చేయాలి.
✺ క్రమం తప్పకుండా చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు పూర్తిగా దూరమవుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Weather Updates: భారీ ఎండల నుంచి ఉపశమనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook