Joint Pain In Monsoon: వర్షాకాలంలో ఈ చిట్కాలతో కీళ్ల నొప్పులకు సులభంగా చెక్‌ పెట్టొచ్చు


Joint Pain In Monsoon: చలి, వానాకాలాల్లో కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం..అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలు కూడా పాటించాలి.  
 


Joint Pain In Monsoon: వర్షకాలంలో వాతావరణంలో తేమ పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ తేమ కారణంగా కీళ్ల నొప్పులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వానా కాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల సులభంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 /5

వానా కాలంలో కీళ్ల నొప్పులు తీవ్రతరం కాకుండా ఉండడానికి తప్పకుండా యోగాసానాలు వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాకింగ్‌ చేయడం వల్ల కూడా కీళ్ల నొప్పులు తీవ్ర తరం కాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 

2 /5

కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వులు, ప్రోటీన్లు గల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర నొప్పులను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 

3 /5

వర్షకాలంలో చాలా మందిలో కీళ్ల నొప్పులు తీవ్ర తరమవుతాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండానికి శరీర బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా డైట్‌ పద్ధతిలో ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

4 /5

చాలా మందిలో చలి, వర్షకాలంలో ఒత్తిడి కారణంగా కూడా కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అయితే తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఒత్తిడి నియంత్రించుకోవాల్సి ఉంటుంది. 

5 /5

ధ్యానం చేయడం వల్ల కూడా చాలా మందిలో ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఒత్తిడి తగ్గి ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.