Stuffy Nose Home Remedy: వాతావరణంలో తేమ పెరగడం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు సస్తాయి. ముఖ్యంగా వానాకాలంలో ఇన్ఫెక్షన్ల వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. లేకపోతే జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి ఇంటి చిట్కాలు పాటిస్తే ముక్కు దిబ్బడ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముక్కు దిబ్బడకు ఇంటి నివారణలు:
స్టీమ్ థెరపీ:
జలుబు, దగ్గు కారణంగా చాలా మందిలో ముక్కు దిబ్బడ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడేవారు పసుపుతో ఆవిరి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ముక్కు క్లియర్ అవుతుంది. అంతేకాకుండా జలుబు సమస్యలు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
కారంగా ఉండే ఆహారాన్ని తినండి:
వానా కాలంలో స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు వీటిని తినొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల ముక్కు దిబ్బడ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
నాసల్ స్ప్రేతో కూడా ఉపశమనం లభిస్తుంది:
ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల నాసల్ స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించడం వల్ల బ్లాక్ అయిపోయిన ముక్కు తెరుకుంటుంది. అయితే వీటిని వినియోగించే ముందు వైద్య నిపుణులను తప్పకుండా సంప్రదించాల్సి ఉంటుంది.
గోరువెచ్చని నీరు తాగాల్సి ఉంటుంది:
ముక్కు దిబ్బడ కారణంగా చాలా మందిలో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది. లేకపోతే ప్రమాదంగా మారే ఛాన్స్ కూడా ఉంది. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు గోరు వెచ్చని నీటిలో తేనె, అల్లం రసం కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Chandrayaan 3: మరి కొద్దిగంటల్లో చంద్రయాన్ 3, కీలకమైన రిహార్సల్ విజయవంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook