లెబనాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా .. ఇజ్రాయిల్ కు చెందిన ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్స్ (IDP)పై ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. అంతేకాదు 60 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ యుఎవితో ఆర్మీ బేస్‌పై దాడి చేసిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.
ఈ ఘటనలో నలుగురు ఐడీఎఫ్ జవాన్లు చనిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని..గాయపడినవారిని ట్రీట్మెంట్ జరుగుతునట్లు తెలిపారు.ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ నుండి ప్రయోగించిన ఐదు డ్రోన్ లను గుర్తించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఎగువ గలిలీ, మిడిల్ గెలీలీ, వెస్ట్రన్ గెలీలీ, హైఫా బే, కార్మెల్‌తో సహా పలు ప్రాంతాల్లో సైరన్‌లు మోగాయి. అయినప్పటికీ, చాలా డ్రోన్ లను ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నా చివరికి ప్రాణ నష్టం జరిగింది.
అంతకు ముందు దక్షిణ లెబనాన్ లోని ఇజ్రాయెల్ సైనికులపై పెద్ద ఎత్తున యాంటీ ట్యాంక్ క్షిపణులను పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని, పలువురు సైనికులు గాయపడ్డారని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తంగా పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మొదలైన యుద్ధం.. అటు లెబనాన్, యెమెన్ లకు చెందిన హెజ్బుల్లా, హౌతీలు.. గాజాలోని హమాస్ గా మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇజ్రాయిల్ దేశంపై మూకుమ్మడి గా మూడు నాలుగు దేశాలు దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ సమరానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో తన దేశ పౌరులు కొంత మంది బలైనా.. ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ తేల్చి చెబుతుంది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter