Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య కేసులో ట్విస్ట్ .. సల్మాన్ ఖాన్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..?

Salman Khan News: బాబా సిద్ధిఖీ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేస్ లో లారెన్స్ బిష్ణోయ్..గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు భారతీయ జనతా పార్టీ నాయకుడు సలహా ఇవ్వడం అందరి దృష్టిని ఈ కేసు వైపు మళ్ళించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఇక్కడ లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ను.. కూడా బెదిరించడం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు మీకోసం..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Oct 14, 2024, 11:40 AM IST
Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య కేసులో ట్విస్ట్ .. సల్మాన్ ఖాన్ క్షమాపణ.. అసలేం జరిగిందంటే..?

Baba Siddique Murder: నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు భారతీయ జనతా పార్టీ నాయకుడు సలహా ఇచ్చారు ఇక్కడ విశేషమేమిటంటే ఇక్కడ లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ను కూడా బెదిరించడం,  ఇంటి నుండి బయట జరిగిన కాల్పుల్లో.. ముఠాలోని కొంతమంది సభ్యులను కూడా అరెస్టు చేయడం జరిగింది. 

ఈ విషయంపై బీజేపీ నేత హరనాథ్ సింగ్ ఇలా పోస్ట్ చేశారు.. మీరు బిష్ణోయ్ కమ్యూనిటీ దేవతగా భావించే కృష్ణ జింకను వేటాడి వండుకొని తిన్నారు.  దీని కారణంగానే బిష్ణోయ్  కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ కమ్యూనిటీలో వారు మీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి మీపై దాడి కూడా చేశారు.  అయితే మీరు పెద్ద నటుడు , దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి మీరు ఆ కమ్యూనిటీ మనోభావాలను గౌరవించాలని,  మీ తప్పుకు ఆ కమిటీకి క్షమాపణలు చెప్పాలని నేను హృదయపూర్వకంగా సలహా ఇస్తున్నాను అంటూ హరనాథ్ సింగ్ తెలిపారు.

అయితే ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..  బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రవీణ్ లోంకర్ ను ఆదివారం సాయంత్రం పూణేలో  అరెస్టు చేయగా ఆయనపై హత్యకు కుట్రపన్నిన 28 ఏళ్ల లోంకర్ కోసం పోలీసులు నిన్నటి నుంచి కూడా వెతకడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత..  లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్ధిఖి ని హత్య చేసింది అంటూ శుభమ్ లోంకర్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. 

దీని తర్వాత లోంకర్  సోదరుల కోసం పోలీసులు వెతకడం ప్రారంభించగా.. ప్రవీణ్ లోంకర్ ను నిన్న సాయంత్రం పూణేలో అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ప్రవీణ్  లోంకర్ తో పాటు శుభమ్ లోంకర్ ఇద్దరు కూడా బాబా సిద్ధికి హత్య కేసులో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వీరితోపాటు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News