India Boosts LPG Gas Supply: పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలపై కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇంధనం, గ్యాస్ కొరత.. ఆపై వాటి ధరలు అమాంతం పెరిగి పోవడం వల్ల అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. దేశానికి అనేక ఓడలు ఎల్పీజీ గ్యాస్‌ను తీసుకొచ్చినా.. నేటికి మార్కెట్లో గ్యాస్ కొరత కనిపిస్తూనే ఉంది.
LPG Ships:పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తత కారణంగా భారత ఇంధన భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ముడి చమురు, LPG, LNG లోడ్‌తో భారత్ వైపు వస్తున్న 17 భారీ నౌకలు ప్రస్తుతం హర్మూజ్ జలసంధి సమీపంలో నిలిచిపోయాయి. నిలిచిపోయిన 17 నౌకల్లో ముడి చమురుతో పాటు వంట గ్యాస్, ప్రకృతి వాయువు నిల్వలు ఉన్నాయి.
Trump on Iran: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించే లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ తెరవడంతో పాటు ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్ ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని తెలిపారు.
Donald Trump Out: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్దం ఇపుడు అమెరికా అధ్యక్షుడి కొంప ముంచేలా ఉన్నాయి. అవును అమెరికా అధ్యక్ష పీఠం నుంచి అధ్యక్షుడిని దింపేందుకు అమెరికన్ కాంగ్రెస్ తో పాటు సొంత పార్టీ రిపబ్లికన్ నేతలే ప్రయత్నాలు మొదలు పెట్టారనే చర్చ ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది.
US Iran War Updates: అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇవాళ మరో మలుపు తిరిగే అవకాశం వుంది. నేటితో ఇరాన్‌కు ట్రంప్ ఇచ్చిన గడువు ముగియనుంది. దీంతో ట్రంప్ ఇరాన్‌ను తక్షణమే డీల్ కుదుర్చుకోవాలని వత్తిడి తెస్తున్నారు. తాను చెప్పినట్టు జరుగపోతే ఇరాన్‌ను ఎవరూ కాపాడలేరని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
Gold Rate Today: గత ఏడాది కాలంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి బంగారం ధరలను ఆకాశానికి చేర్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో కిందటేడాది బంగారం ఏకంగా 70 శాతం, వెండి 150 శాతం వరకు పెరిగి రికార్డులు సృష్టించాయి. ఈ ఏడాది ఆరంభంలో కూడా అదే జోరు కొనసాగినప్పటికీ, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం పసిడి పరుగుకు బ్రేకులు వేసింది.
Pakistan: యూఎస్, ఇజ్రాయేల్ లు సంయుక్తంగా ఇరాన్ పై భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రతీకార దాడులు చేస్తుంది. మరోవైపు ఈ యుద్దం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇప్పటికే చమురు,ఎల్పీజీ, డీజీల్ కొరతతో జనాలు భయపడిపోతున్నారు. పాక్ లో నిత్యవసరాల ధరలు చుక్కలు తాకాయి.పెట్రోల్, డీజీల్ , ఎల్పీజీ ధరలు రెండు వందల రెట్లు పెరిగాయి. మరోవైపు పాక్ లో నిత్యవసరాల్ని జాగ్రత్తగా వాడుకొవాలని ప్రభుత్వం సూచించింది. ఇక లాక్ డౌన్ వైపుకు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
PM Modi inaugurates Noida International Airport: యూపీలోని నోయిడాలో అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్రంపై వస్తున్న ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Pm modi big alert on iran israel war: దేశ ప్రజలు ఎలాంటి విపత్తులు ఎదుర్కొవడానికైన సిద్దంగా ఉండాలని ప్రధాని రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
US Iran War: యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు సఫలమైతే ఉద్రిక్తతలు తగ్గే ఛాన్స్ వుంది. ఈ చర్చల కోసం తటస్థ ప్రాంతంగా పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Trump holds striking on iran for five days: ఇరాన్ తో చర్చలు ఫలవంతమయ్యాయని జరుగుతున్నాయని యుద్దంను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీంతో ప్రపంచ దేశాలన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నాయి.
Pm modi speech in loksabha: విదేశాల్లో ఉన్న భారతీయులను ఇప్పటికే 3.75 లక్షల మందిని స్వదేశంకు తీసుకొచ్చామని మోదీ లోక్ సభలో తెలిపారు. అంతే కాకుండా వ్యూహత్మక చమురు నిల్వలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Iran America War: ఇరాన్ తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆయుధాలతో పాటు..ఆర్ధికంగా భారీగా నష్టపోతుంది. తాజాగా అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. వీటిల్లో 10 MQ-9 రీపర్ డ్రోన్లను ఇరాన్ దళాలు కూల్చగా.. మరికొన్ని యుద్ధంలో దాడికి గురయినట్లు తెలుస్తోంది.
No Gas: భారత్ కు గ్యాస్ కష్టాలు తప్పేలా లేవు...ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భారత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు భారత్ ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకు దిగజారుతోంది. ఖతార్‌లోని కీలక రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం సహా చమురు రిఫైనరీలపై ఇరాన్ భీకర దాడులకు దిగింది. వీటితో పాటు నౌకలపైకీ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ విద్యుత్ గ్రిడ్‌పైనా దాడి చేసింది.. సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది.
Iran Attacks on Qatar: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. పశ్చిమాసియాలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేయడంతో యుద్ధం పతాక స్థాయికి చేరింది. గల్ఫ్‌లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై గురువారం ఇరాన్ చేసిన భీకర దాడులు కల్లోలం రేపాయి. పలు రిఫైనరీలు మంటల్లో చిక్కుకున్నాయి. నౌకలపైనా ఇరాన్ దాడులతో విరుచుకుపడింది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ రిఫైనరీ ఉన్న ఖతాలర్ చమురు క్షేత్రాలపై విరుచుకు పడింది.
Mojtaba Khamenei:ఇరాన్ దేశానికి ఇజ్రాయిల్ మరో ఘాటైన వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం భయంకరంగా జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని వెంటాడి.. వేటాడి పట్టుకొని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు పంపింది. ఇజ్రాయెల్ కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు తమ నుంచి తప్పించుకోలేరన్నారు.
Cruid Oil: యుద్ధ భయాలు ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. ఇరాన్ - ఇజ్రాయెల్- అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే... ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వనరులకోసం ఇబ్బంది పడుతున్నారు. బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. చమురు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన వనరులపై ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎన్నడూ లేని విధంగా పెరగడంతో పరిశ్రమలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇరాన్ లో యుద్ధం జరిగితే... మనకెందుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి? ఇంధన సంక్షోభం ఎదుర్కొనేదెలా?
NATO Countries: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ జల సంధిని ఓపెన్ చేసేందుకు సహకరించాలని మిత్ర దేశాలు, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.
Trump Big Claim on Iran :ఇరాన్‌లో 7 వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తాము దాడులు చేయలేదని, ప్రధానంగా వాణిజ్య, మిలిటరీ కేంద్రాలపైనే దాడులు చేసినట్టు చెప్పారు.
Iran Warns Israel: ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ నెతన్యాహుకి హెచ్చరించింది. నెతన్యాహును వెంటాడి ఖతం చేస్తామని ప్రకటించింది. పిల్లల ప్రాణాలు తీసే వ్యక్తిగా ఇజ్రాయెల్ ప్రధానిని పేర్కొంటూ వారి మరణాలకు ప్రతీకారం తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. యుద్ధంలో ఆయన ప్రాణాలు కోల్పోయారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇందుకు నెతన్యాహు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో ఇందుకు ప్రధాన కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.