Bottle Gourd For White Hair To Black Hair: పూర్వీకులు జుట్టు నెరిసిపోతే వయసు దగ్గర పడుతుందని భావించేవారు. ప్రస్తుతం చిన్న పిల్లలో కూడా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా ముఖం అందహీనంగా తయారవుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఆందోళన చెందనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. చిన్న వసుల్లో తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
జుట్టు నల్లగా మారడానికి గోరింటాకును వినియోగించవచ్చా?:
ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే కెమికల్ హెయిర్ డైలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు జుట్టుకు గోరింటాకు మిశ్రమం కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.
సొరకాయతో తయారు చేసిన ఆయిల్ అప్లై చేయండి:
చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సోరకాయతో తయారు చేసిన ఆయిల్ వినియోగించాల్సి ఉంటుంది. ఇందులోమ ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
ఆయిల్ తయారి పద్ధతి:
❀ ఈ నూనెను తయారు చేయడానికి ముందుగా సోరకాయను పొట్టుతో పాటు కట్ చేసుకోవాలి.
❀ ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఎండబెట్టుకోవాలి.
❀ ఎండబెట్టిన తర్వాత పొడిలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
❀ ఆ తర్వాత బాణలిలో 250 గ్రాముల కొబ్బరి నూనెను వేసుకుని వేడి చేయాల్సి ఉంటుంది.
❀ ఇలా చేసిన తర్వాత తయారు చేసుకున్న సోరకాయ పొడిని ఆ నూనెలో వేసుకోవాలి.
❀ ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
❀ ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
❀ ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.
సొరకాయ రసం తాగండి:
ప్రతి రోజు సోరకాయ రసం తాగడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో నీటి శాతం అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఈ రసం తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించడమేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook