Delhi Red Fort: దేశ రాజధాని ఢిల్లీ గురించి ప్రస్తావిస్తే తప్పకుండా గుర్తొచ్చేది ఎర్రకోట లేదా రెడ్ ఫోర్ట్. అసలీ కోటను ఎర్రరంగులో ఎందుకు నిర్మంచారనేది పరిశీలిస్తే అసలు వాస్తవం తెలుస్తుంది. ఎర్రకోటకు ఇప్పుడున్న ఎర్రరంగు అసలు రంగు కాదట. ఆ రంగు ఇచ్చింది ఆంగ్లేయులు.
Delhi Red Fort: దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే గుర్తొచ్చే ఎర్రకోట ఠీవి, రాజసం మరి దేనికీ సాటి రావు. దుర్బేధ్యమైన కోటగా అప్పట్లో పేరున్న ఈ కోట ఇప్పటికీ దేశ స్వాతంత్ర్య వేడుకలకు వేదికగా ఉంటోంది. ఎర్రరంగులో రాజసం ప్రదర్శిస్తున్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గురించి పూర్తి వివరాలు మీ కోసం..
ఎర్రకోటను కిలా ఎ ముబారక్ అని కూడా పిలుస్తారు. మొగల్ చక్రవర్తుల కాలంలో ముబారక్ కోటగా కూడా పిలిచేవారు. మొగల్ చక్రవర్తి షాజహాన్ తన తాత అక్బర్‌కు గుర్తుగా ఆగ్రా రెడ్ ఫోర్ట్ స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ ఎర్రకోటను నిర్మించాడు.
ఢిల్లీ ఎర్రకోటను సున్నపురాయితో నిర్మించారు. దీని రంగు తెలుపు. కానీ వాతావరణం కారణంగా పాడవుతుండటంతో ఆంగ్లేయులు తెలుపురంగు నుంచి ఎర్రరంగుకు మార్చారు.
1858 సిపాయిల తిరుగుబాటు తరువాత ఆంగ్లేయులు ఆక్రమించారు ఈ కోటను. ఇండియాకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ఈ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేయడం ప్రారంభించారు. 2007లో యునెస్కో ఈ కోటను ప్రపంచ హెరిటేజ్ సంపదగా గుర్తించింది.
యమునా నది ఒడ్డున నిర్మితమైంది ఢిల్లీ ఎర్రకోట. షాజహాన్ కంటే ముందు మొఘల్ చక్రవర్తులు ఆగ్రా రాజధానిగా పాలించేవారు. కానీ షాజహాన్ రాజధానిని ఆగ్రా నంచి ఢిల్లీకు మార్చాడు.
ఢిల్లీ ఎర్రకోట ఎన్నో చారిత్రాత్మక ఘటనలకు వేదిక, నిలువెత్తు సాక్ష్యం. ఈ కోటకు రక్తం చిందించిన చరిత్ర ఉంది. ఫరూఖ్ షియర్ నుంచి బహదూర్ షాహ్ జాఫర్ పాలన వరకూ చాలా ఘటనలకు కేంద్రంగా నిలిచింది.