Unlucky Plants: ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే చాలు..క్షణాల్లో జీవితం సర్వ నాశనమేనట, తస్మాత్ జాగ్రత్త

Unlucky Plants: హిందూ వాస్తుశాస్త్రం ప్రకారం చాలా రకాల అంశాలకు వేర్వేరు ప్రాధాన్యతలు, విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఏవి ఎక్కడ ఉండాలి, ఏవి ఉండవచ్చు, ఏవి ఉండకూడదనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి. వీటిని పట్టించుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందంటారు వాస్తు నిపుణులు.

Unlucky Plants: వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు సూచనలను నిర్లక్ష్యం చేయకూడదంటారు. ముఖ్యంగా 5 రకాల మొక్కలు ఉండకూడదట. ఇవి ఉంటే ఆ ఇంట్లో నాశనమేనట. ఈ 5 రకాల మొక్కలు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుందని అర్ధం అంటున్నారు వాస్తు పండితులు.

1 /5

చింత, గోరింటాకు చెట్టు చింత, గోరింటాకు చెట్లు ఇంట్లో ఉండకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇవి చెడు ఆత్మలకు నివాసాలు. అందుకే చింత చెట్టు పక్కనే ఉన్న ఇళ్లు కొనుగోలు చేయవద్దని వాస్తుశాస్త్రం చెబుతుంటుంది. ఈ రెండు చెట్లలో నెగెటివ్ ఎనర్జీ ఉంటుందట.

2 /5

రావి చెట్టు రావి చెట్టు సాధారణంగా దేవాలయాల వద్ద కన్పిస్తుంటాయి. కానీ ఇంటి పరిసరాల్లో అస్సలుండకూడదు. మీ ఇంటి పరిసరాల్లో ఒకవేళ రావి చెట్టు ఉంటే వాటిని ఏదైనా పవిత్ర ప్రదేశాలకు మార్చేయాలి. లేకపోతే ధనహాని కలుగుతుంది.

3 /5

పత్తి మొక్క చలికాలంలో పత్తి మొక్కల్ని ఇంటి కిటికీ వైపు ఉంచితే చాలా అందంగా కన్పిస్తుంది. కానీ ఇంటి పెరట్లో ఇది ఉండటం అశుభ సంకేతం. వాస్తు ప్రకారం పత్రి మొక్కను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. 

4 /5

క్యాక్టస్ వాస్తుశాస్త్రం ప్రకారం క్యాక్టస్ మొక్కను ఇంట్లో ఉంచడం అశుభ సంకేతం. దీనివల్ల ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రసరితమౌతుంది. ఆకులపై ముళ్లుంటే అవి నెగెటివ్ ఎనర్జీకు కేంద్రాలుగా భావిస్తారు. క్యాక్టస్ మొక్క ఇంట్లో దారిద్య్రాన్ని తీసుకొస్తుందని నమ్మకం.

5 /5

బోన్సాయి మొక్క వాస్తుశాస్త్రం ప్రకారం బోన్సాయి మొక్క ఇంట్లో ఉండకూడదు. కానీ చాలామంది ఇళ్లలో ఇది తప్పకుండా కన్పిస్తుంటుంది. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉన్నా...ఇంట్లో ఉంచకూడదు. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల జీవితచక్రంలో ఆటంకం ఏర్పడుతుంది. మీ కెరీర్, వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు.