Thyroid Control Foods: ఈ 5 ఫుడ్స్ రోజూ తీసుకుంటే థైరాయిడ్ ఇట్టే మాయం

Thyroid Control Foods: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, సకాలంలో నిద్ర లేకపోవడం వంటి కారణలతో వివిధ రకాల వ్యాధులు తలెత్తుతున్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైంది థైరాయిడా్.
 

Thyroid Control Foods: మధుమేహంలానే థైరాయిడ్ కూడా దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఐదు రకాల ఆహార పదార్ధాలను డైట్‌లో చేర్చుకుంటే థైరాయిడ్ అత్యంత సులభంగా నియంత్రించవచ్చంటున్నారు.
 

1 /6

థైరాయిడ్-ధాన్యం బ్రౌన్ రౌస్, క్వినోవా వంటి ధాన్యం వినియోగిస్తే మెటబోలిజం వేగవంతమౌతుంది. ఇందులో ఫైబర్ భారీగా ఉంటుంది. అందుకే థైరాయిడ్ గ్లాండ్స్ సరైన రీతిలో పనిచేస్తాయి.

2 /6

థైరాయిడ్-నట్స్ థైరాయిడ్ సమస్య ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డైట్ మార్పులు, తగిన వ్యాయామంతో సరిచేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.

3 /6

ధైరాయిడ్-ఆకు కూరలు థైరాయిడ్ సమస్య దూరం చేసేందుకు ఎక్కువగా ఆకు కూరలు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. పలితంగా థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది.

4 /6

థైరాయిడ్ - పప్పు దినుసులు శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు థైరాయిడ్ దూరం చేసేందుకు పప్పు ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు పెద్దమొత్తంలో లభిస్తాయి. థైరాయిడ్ నియంత్రణలో వస్తుంది.

5 /6

థైరాయిడ్ -బీట్‌రూట్ థైరాయిడ్ దూరం చేసేందుకు బీట్‌రూట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి పెద్ద మొత్తంలో ఉండటం వల్ల థైరాయిడ్ నియంత్రణలో రావచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది.

6 /6

థైరాయిడ్ ఎందుకొస్తుంది హార్మోన్ మార్పు, హార్మోన్ పెరగడం వల్ల ఈ వ్యాధి ప్రారంభమౌతుంది. ఒకసారి వచ్చిందంటే ఇక సమస్య పెరుగుతూ పోతుంది. థైరాయిడ్ సమస్య మహిళల్లో ఎక్కువగా కన్పిస్తుంది. వయస్సు పెరగడంతో పాటు మహిళల్లో థైరాయిడ్ తగ్గడం లేదా పెరగడం ఉంటుంది. థైరాయిడ్ సమస్యను నియంత్రించేందుకు ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం. ముఖ్యంగా 5 రకాల ఆహార పదార్దాలను డైట్‌లో చేర్చాలి.