Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి..? ఆ ట్వీట్‌తో రాములమ్మ హింట్ ఇచ్చారా..?

Vijayashanti On Sonia Gandhi: విజయశాంతి చేసిన ఓ ట్వీట్ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలకు అతీతంగా సోనియా గాంధీని గౌరవిస్తామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లోకి విజయశాంతి వెళ్లనున్నారా..? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 18, 2023, 03:05 PM IST
Vijayashanti: కాంగ్రెస్‌లోకి విజయశాంతి..? ఆ ట్వీట్‌తో రాములమ్మ హింట్ ఇచ్చారా..?

Vijayashanti On Sonia Gandhi: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి రేసులో ఒక అడుగు ముందు వేయగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపిక పనిలో ఉన్నాయి. ఇప్పటికే పోటీపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాయి. వీటన్నింటిని క్రోడికరించి.. ఫైనల్ లిస్ట్‌ను రెడీ చేయనున్నాయి. ఈలోపు ప్రత్యర్థి పార్టీలలో అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇటు పొలిటికల్ కామెట్స్‌ కూడా గట్టిగానే చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి చేసిన ఓ ట్వీట్ చర్చకు దారితీసింది.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అంటే తనకు అభిమానం.. గౌరవం అని విజయశాంతి చెప్పడంతో బీజేపీలో కలవరం మొదలైంది. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే అని.. సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో తాను చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం అని అన్నారు. అయితే మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుందనే వ్యాఖ్య పూర్తిగా అయోమయ అంశమని పేర్కొన్నారు. విజయశాంతి ట్వీట్‌లో ఏం రాశారంటే..?

"ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అని.. సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం. అయితే మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుందనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం. అర్థం కాని విషయం కూడా.. అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తుందా..? కాంగ్రెస్ ఓడిపోతుందా..? ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా..? కాబట్టి ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా..? ఒక్క మాటలో దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చేయగలుగుతుందా..? ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం.. రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం.." అని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. రాములమ్మ కాంగ్రెస్‌లో చేరేందుకు హింట్ ఇచ్చారా..? అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని కోరుతున్నారు. ఒక్కసారి ఆలోచించాలని.. దొరను ఇంటికి పంపించాలంటే అందరూ ఏకం అవ్వాలని.. కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అంటున్నారు. "మీ లక్ష్యం నెరవేరాలంటే అది కాంగ్రెస్‌తో మాత్రమే జరుగుతుంది. బీజేపీతో కాదు. అన్ని తెలిసిన మీకు చెప్పే అంత వాళ్ళం కాదు.." అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Also Read: World Cup 2023: ప్రపంచకప్‌కు ముందు వన్డేల్లో నెం.1గా నిలిచేదెవరు..? లెక్కలు ఇలా..!  

Also Read: Bigg Boss-7 Telugu: రెండో వారం ఎలాంటి ట్విస్టుల్లేవ్.. హౌస్ నుంచి ఆమె ఔట్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News