గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహార పదార్థాలు

  • Sep 20, 2023, 19:09 PM IST

గుండె సంబంధిత వ్యాధులకు లోనయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మన దేశంలో ఎక్కువగా నూనెలు వాడటం మరియు అనారోగ్యకర జీవనశైలి ఎక్కువగా అనుసరించటం వలన గుండె వ్యాధులకు లోనవుతున్నారు. 
 

1 /5

మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన భాగం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఆ ఆహార పదార్థాలు ఇవే.. 

2 /5

గుడ్లలో ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయని మాత్రమే మనకు తెలుసు.. కానీ గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ లు కూడా అధికంగా ఉంటాయి. రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్లను తింటే మీ గుండె ఆరోగ్యం  మెరుగుపడుతుంది.  

3 /5

చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్ పుష్కలంగా ఉంటాయన్న సంగతి మన అందరికి తెలిసిందే. దీంతో పాటుగా విటమిన్ B5, మెగ్నీషియం, ప్రొటీన్లు, పొటాషియం వంటి  మూలకాలు కూడా శరీరానికి అందిస్తాయి. సాల్మన్ ఫిష్ లో ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి.  

4 /5

అవిసె గింజలే అని తీసిపారేయకండి. వీటిలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ అధిక మొత్తంలో ఉంటాయి. అంతేకాకుండా వీటిలో మెగ్నీషియం, విటమిన్ C వంటి పోషకాలను కూడా ఉంటాయి.    

5 /5

సోయాబీన్ లో ప్రోటీన్ మాత్రమే కాకుండా.. ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వలన శరీరానికి ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం మరియు ఫోలేట్ వంటి పోషకాలు కూడా అందుతాయి.