Hamas Militants Attack On Israel: ఇజ్రాయెల్‌పై దండెత్తిన పాలస్తీనా ఉగ్రవాదులు.. 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లతో దాడి

Israel Launches Operation Iron Swords: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 20 వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ప్రతీగా ఇజ్రాయెల్‌ కూడా ప్రతిదాడులకు దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 7, 2023, 04:04 PM IST
Hamas Militants Attack On Israel: ఇజ్రాయెల్‌పై దండెత్తిన పాలస్తీనా ఉగ్రవాదులు.. 20 నిమిషాల్లో 5 వేల రాకెట్లతో దాడి

Israel Launches Operation Iron Swords: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా వేలాది రాకెట్లతో దండెత్తింది. శనివారం ఉదయం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై 5 వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. అటు ఉగ్రవాదులు గాజా స్ట్రిప్ గుండా ఇజ్రాయెల్‌పై దాడి చేసి.. సరిహద్దులోకి చొరబడ్డారు. ఇజ్రాయెల్‌లోకి దూరిన ఉగ్రవాదులు.. కనబడిన వారిని కాల్చుకుంటూ వెళ్లారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లు ఇజ్రాయెల్‌లోని  జెరూసలెం, టెల్ అవివ్‌ సహా దేశవ్యాప్తంగా దాడి చేశాయి. ఈ ఆకస్మిక దాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్‌.. వెంటనే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి యుద్ధం ప్రకటించారు. 

ప్రజలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇళ్లు వదలి బయటకు రావద్దని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం హమాస్ ఉగ్రవాదులు తీవ్రమైన తప్పు చేశారని అన్నారు. ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రారంభించారని.. తమ సైనికులు ప్రతిచోటా శత్రువులతో పోరాడుతున్నారని చెప్పారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుస్తుందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ దాడులకు ప్రతిస్పందనగా.. ఇజ్రాయెల్ యుద్ధ విమనాలు గాజా స్ట్రిప్‌లోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' పేరుతో హమాస్‌పై అటాక్‌కు దిగింది. 

ఇజ్రాయెల్‌పై దాడికి బాధ్యత వహిస్తూ హమాస్ ప్రతినిధి మహ్మద్ దీఫ్ ప్రకటన విడుదల చేశాడు. ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా.. పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిలబడాలని కోరాడు. జెరూసలేంలోని అల్ అక్సా మసీదుపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా తాము ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించాడు. ఆపరేషన్‌ ఆల్‌-అక్సా స్ట్రామ్‌ ప్రారంభించామని.. ఇప్పటివరకు 5 వేల రాకెట్లను ప్రయోగించినట్లు ఓ వీడియోను విడుదల చేశాడు. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న మహ్మద్ దీఫ్.. ఇప్పుడు వీడియోను విడుదల చేయడం గమనార్హం. 

ఇస్లాం పేరుతో లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్‌లు ఏకం కావాలని ఆయన వీడియోలో కోరాడు. ఇజ్రాయెల్‌పై అల్ అక్సా స్టార్మ్ ఆపరేషన్ ప్రారంభమైందన్నాడు. ఇస్లాం అనుచరులందరినీ తమకు సాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశాడు. సిరియా, లెబనాన్, ఇరాక్, ఇరాన్ ప్రజలందరూ జెండాలు, సరిహద్దులలో ఏకం కావాలని కోరాడు. ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన హమాస్ ఉగ్రవాదులు.. సరిహద్దుల్లోని ఓ పోలీస్ స్టేషన్‌పై అటాక్ చేసి.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హమాస్ దాడిలో కనీసం 22 మంది ఇజ్రాయెలీలు మరణించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఇజ్రాయోల్‌లో ఉన్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను అనుసరించాలని కోరింది.

Also Read: Osmania University: ఉస్మానియా వర్సిటీకి కేంద్రం గుడ్‌న్యూస్.. హాస్టళ్ల నిర్మాణానికి నిధులు విడుదల 

Also Read: Muktinath Cable Car Project: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం.. కీలక ఒప్పందానికి ఆమోదం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x