Bishan Singh Bedi's Death News: టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం ఇక లేరు

Bishan Singh Bedi's Death News: 1975 వరల్డ్ కప్ టోర్నీలో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో ఆ జట్టు నడ్డి విరిచి ప్రత్యర్థి జట్టు కేవలం 120 పరుగులకే పరిమితం చేసిన ఘనత బిషన్ సింగ్ బేడి సొంతం. బిషన్ సింగ్ బేడి పేరు ప్రఖ్యాతలు క్రికెట్ కి మాత్రమే పరిమితం కాలేదు. బిషన్ సింగ్ బేడి స్ట్రెయిట్ షూటర్ కూడా. 

Written by - Pavan | Last Updated : Oct 23, 2023, 08:07 PM IST
Bishan Singh Bedi's Death News: టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం ఇక లేరు

Bishan Singh Bedi's Death News: టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ ఇక లేరు. 12 ఏళ్లపాటు తిరుగులేని క్రికెట్ కెరీర్ ఎంజాయ్ చేసిన స్పిన్ మాంత్రికుడు బిషన్ సింగ్ బేడీకి టీమిండియా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. టీమిండియా తరపున 67 టెస్ట్ మ్యాచ్ లు, 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన బిషన్ సింగ్ బేడి తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థలు గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. కేవలం 67 మ్యాచ్ ల టెస్ట్ కెరీర్ లోనే 266 వికెట్లు తీసిన బిషన్ సింగ్ బేడి.. ఈరపల్లి ప్రసన్న, బిఎస్ చంద్రశేఖర్, ఎస్ వెంకట రాఘవన్ వంటి బౌలింగ్ దిగ్గజాలతో కలిసి టీమిండియా స్పిన్ విభాగాన్ని పటిష్టంగా మలిచాడు.

1975 వరల్డ్ కప్ టోర్నీలో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో ఆ జట్టు నడ్డి విరిచి ప్రత్యర్థి జట్టు కేవలం 120 పరుగులకే పరిమితం చేసిన ఘనత బిషన్ సింగ్ బేడి సొంతం. ఈ చారిత్రక విజయం టీమిండియాను అగ్రభాగానికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా దేశవాళీ క్రికెట్ పై సైతం బిషన్ సింగ్ బేడి తన ముద్ర వేశాడు. డొమెస్టిక్ క్రికెట్లో 370 మ్యాచ్ ల్లో 1560 వికెట్లు తీసి స్పిన్ బౌలింగ్ లో రానించాలనుకునే ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. 

బిషన్ సింగ్ బేడి పేరు ప్రఖ్యాతలు క్రికెట్ కి మాత్రమే పరిమితం కాలేదు. బిషన్ సింగ్ బేడి స్ట్రెయిట్ షూటర్ కూడా. మైదానం లోపల, మైదానం బయట స్ట్రెయిట్ షూటర్ గా బిషన్ సింగ్ బేడి పేరు అప్పటి వారికి ఎంతో సుపరిచితం. ఆటగాడిగానే కాకుండా ఒక వ్యక్తిగానూ బిషన్ సింగ్ బేడి వ్యక్తిత్వం ఎంతో ప్రత్యేకం. 

ఇది కూడా చదవండి : Rohit Sharma: బంతిని ఆపబోయి కిందపడ్డ రోహిత్ శర్మ.. ఇదేం ఔట్‌ఫీల్డ్‌ రా అంటూ అసహనం

బిషన్ సింగ్ బేడి మృతితో యావత్ క్రీడా ప్రపంచంతో పాటు క్రికెట్ ప్రముఖులు బిషన్ సింగ్ బేడితో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. క్రికెట్ అభిమానులు సైతం కిషన్ సింగ్ బేడిపై తమ గౌరవాన్ని చాటుకుంటూ బేడికి అంతిమ నివాళి అర్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Ind Vs NZ Highlights: మరోసారి విరాట్ పరాక్రమం.. కివీస్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News