Virat Kohli: కోహ్లీ సెంచరీ వెనుక అసలు కథ ఇది.. వివాదానికి కేఎల్ రాహుల్ చెక్

KL Rahul On Virat Kohli Century: బంగ్లాదేశ్‌పై అద్బుత రీతిలో విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 97 పరుగుల వద్ద సిక్సర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే కోహ్లీ సెంచరీ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. క్రీజ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ సపోర్ట్‌తో కింగ్ కోహ్లీ వన్డేల్లో తన 48 సెంచరీ బాదాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 20, 2023, 09:50 AM IST
Virat Kohli: కోహ్లీ సెంచరీ వెనుక అసలు కథ ఇది.. వివాదానికి కేఎల్ రాహుల్ చెక్

KL Rahul On Virat Kohli Century: టీమిండియా రన్‌ మెషీన్ విరాట్ కోహ్లీ పరుగుల దాహం ఇప్పట్లో తీరేలా లేదు. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తూ.. అన్ని రికార్డులను తన పేరు మీద లిఖించుకునేందుకు రెడీ అవుతున్నాడు. బంగ్లాదేశ్‌పై తన 48వ వన్డే సెంచరీని పూర్తి చేసుకుని.. సచిన్ రికార్డుకు మరింత చేరువయ్యాడు. 97 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 50 ఓవర్లలో 256/8 స్కోరు చేసింది. అనంతరం భారత్ కేవలం 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయానికి రెండు పరుగులు అవసరమైన సమయంలో కోహ్లీ సిక్సర్‌ బాది తన సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు జట్టుకు విజయాన్ని అందించాడు. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ (34 నాటౌట్) కోహ్లీ సెంచరీకి తోడ్పాటు అందించాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ శతకం బాదుతాడని ఎవరూ ఊహించలేదు. టీమిండియా విజయానికి 27 పరుగులు కావాలి. అప్పుడు కోహ్లీ 74 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అంటే ఇందులో 26 పరుగులు కోహ్లీ ఒక్కడే చేయాలి. అవతలి ఎండ్‌లో కేఎల్ రాహుల్ జోరు మీద ఉన్నాడు. తన స్పీడ్ పూర్తిగా తగ్గించేసిన కేఎల్ రాహుల్.. కోహ్లీని సెంచరీ చేయాలని ప్రోత్సహించాడు. కోహ్లీ సింగిల్స్ కోసం ట్రై చేసినా.. రాహుల్ వద్దని చెప్పాడు. చాలా ఓవర్లు ఉన్నాయని.. సెంచరీ కొట్టేయాలని ఎంకరేజ్ చేశాడు. దీంతో విరాట్ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ శతకానికి చేరువయ్యాడు.

అయితే సెంచరీకి ముందు కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 41 ఓవరల్ ముగిసే సమయానికి భారత్ విజయానికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. కోహ్లీ 97 పరుగుల వద్ద ఉన్నాడు. బౌండరీ కొడితేనే కోహ్లీ సెంచరీ పూర్తవుతుంది. 42 ఓవర్ వేసిన నసుమ్ అహ్మద్ తొలి బాల్‌ను డాట్ చేశాడు. రెండో బంతిని లెగ్ సైడ్ వేయగా కోహ్లీ వదిలేశాడు. దీంతో వైడ్ బాల్ అయిందని ఫ్యాన్స్ నిరాశపడుతున్న సమయంలో అంపైర్ వైడ్ ఇవ్వలేదు. కోహ్లీ లోపలికి జరిగాడనే ఉద్దేశంతో ఎలాంటి సిగ్నల్ ఇవ్వలేదు. ఇక మూడో బంతిని ఫుల్‌టాస్ వేయగా.. కోహ్లీ కొంచెం ముందుకువచ్చి సిక్సర్ బాదాడు. ఇక అంతే టీమిండియా ఆటగాళ్లతోపాటు స్టేడియంలోని అభిమానులు సంతోషంతో గెంతులేశారు. కోహ్లీ నామస్మరణతో స్టేడియం మార్మోగిపోయింది.

విరాట్ కోహ్లీ సెంచరీ గురించి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. కోహ్లీ సెంచరీ చేస్తానా..? లేదా..? అయోమయంలో ఉన్నాడని.. తాను సింగిల్స్ వద్దని చెప్పానని తెలిపాడు. "సింగిల్స్ తీయకపోతే వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నారని ఫ్యాన్స్ భావిస్తారని కోహ్లీ అన్నాడు. మనం మ్యాచ్ ఎలాగూ గెలుస్తున్నాం. ఇది ప్రపంచ కప్ మ్యాచ్. తప్పకుండా ప్రయత్నించి.. సెంచరీ పూర్తి చేయు.." అని కోహ్లీతో చెప్పినట్లు రాహుల్ తెలిపాడు. సెంచరీ కోసమే కోహ్లీ ఆడాడని విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టాడు. 

Also Read: CM Jagan: ఏపీలో అర్చకులకు శుభవార్త.. సీఎం జగన్ దసరా గిఫ్ట్  

Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News