IPL 2024 Auction: ఐపీఎల్ 2024 సీజన్ 17 కు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఐపీఎల్ సీజన్ 17 వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది. రేపు అంటే నవంబర్ 26 సాయంత్రం 4 గంటల్లోగా అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్ ప్రకటించనున్నాయి. ఎవరు ఇన్, ఎవరు అవుట్, ఎవరు వేలంలో ఉంటారో తేలిపోనుంది.
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన వెంటనే ఇప్పుడు ఫోకస్ అంతా ఐపీఎల్ 2024 వేలంపై పడింది. వచ్చే నెలలోనే మెగా వేలం జరగనుంది. రేపటిలోగా ఐపీఎల్‌లోని పది ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్ ప్రకటిస్తే ఎవరు వేలంలో ఉంటారు, ఎవరు కొనసాగుతారనేది క్లారిటీ రానుంది. ఈలోగా కొన్ని ఊహించని పరిణామాలు వివిధ ఫ్రాంచైజీల్లో కన్పించనున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వదిలి ముంబై ఇండియన్స్‌కు చేరవచ్చని తెలుస్తోంది. స్వాపింగ్ ప్రక్రియ ద్వారా ఈ మార్పు జరగనుందని సమాచారం. అదే సమయంలో ముంబై ఇండియన్స్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్‌ను ముంబై వదులుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో చేరితే రోహిత్ కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడా అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ఫ్రాంచైజీ ఈసారి శామ్ కుర్రెన్, ధావన్‌ను వదులుకోనుంది. చెన్నై నుంచి బెన్ స్టోక్స్ ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ వదులుకుంటోంది. ఇక కేకేఆర్ జట్టు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లను వదులుకోవచ్చు. డిల్లీ ఫ్రాంజైజీ అయితే మనీష్ పాండే, పృధ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, నాగర్కోటిలను వదులుకోనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన ఆవేశ్ ఖాన్ స్వాపింగ్ ప్రక్రియలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చేరవచ్చు.
ఇదంతా ఓ ఎత్తైతే వన్డే ప్రపంచకప్ 2023లో సంచలనాలు నమోదు చేసిన కీలక ఆటగాళ్లు ముగ్గురిపై అన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఆస్ట్రేలియాకు కప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌పైనే ఐపీఎల్ 2024 వేలంలో అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారిస్తున్నాయి. అదే విధంగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌లకు భారీ డిమాండ్ ఉండవచ్చు.
Also read: IPL 2024: వేలానికి ముందే చెన్నైకు షాక్, ఐపీఎల్ 2024 నుంచి ఆ ఆటగాడు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook