Minister Harish Rao: బీఆర్ఎస్‌కు వచ్చే సీట్లు ఎన్నో చెప్పేసిన హరీశ్‌రావు.. రైతుబంధు అమలు అప్పుడే..!

Minister Harish Rao on Rythu Bandhu: రైతుల నోటికాడి బుక్కను కాంగ్రెస్ లాగేందని మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్‌ వేయడంపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని.. డిసెంబర్ 6వ తేదీ నుంచి రైతుబంధు అమలు చేసుకుందామన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 27, 2023, 08:11 PM IST
Minister Harish Rao: బీఆర్ఎస్‌కు వచ్చే సీట్లు ఎన్నో చెప్పేసిన హరీశ్‌రావు.. రైతుబంధు అమలు అప్పుడే..!

Minister Harish Rao on Rythu Bandhu: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభం నాటి నుంచి రైతాంగ వ్యతిరేక చర్యలు పాల్పడుతోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అధికారంలో ఉన్నపుడు కూడా కాంగ్రెస్ అదే పరిస్థితి అని.. అర్ధరాత్రి పూట కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టిందని.. ఎరువులు ఇవ్వకుండా రైతులను బాధ పెట్టిందని మండిపడ్డారు. 2009లో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులు కట్టలేదు.. నీళ్ళు ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీ వద్ద తాము ధర్నా చేస్తే పట్టించుకోలేదని గుర్తుచేశారు. నాడు అధికారంలో ఉండీ రైతులను గోస పెట్టిందని.. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతోందని మండిపడ్డారు. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్ రెడ్డి అని కౌంటర్ ఇచ్చారు.

"అక్టోబర్ 23న మానిక్ రావు థాక్రే రైతు బంధు వేయవద్దని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టి చెప్పారు. భట్టి రైతు బంధు దుబారా అంటే.. రేవంత్ రైతులు బిచ్చగాళ్లు అంటారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇక్కడే ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక అక్కడ రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారు. ఇక్కడ వాళ్లే రైతు బంధుపై ఫిర్యాదు చేశారు. అనుమతి ఇస్తే ఎలా ఇస్తారు అన్నారు. మళ్లీ రద్దు చేయాలని మీరే ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బీజేపీ-బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం అని తప్పు మాట్లాడుతారు.

రైతుల నోటి కాడి బుక్కను లాగేసింది కాంగ్రెస్ పార్టీ.. దొంగే దొంగ అన్నట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. వంద పిల్లులు తిన్న పిల్లు నేను శాఖాహారి అన్నట్టు ఉంది. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు నవంబర్ 30న ఎన్నికల్లో బుద్ది చెప్పాలి. దేశంలో రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేతిని అడ్డం పెట్టి రైతు బంధు ఆపలేరు. ఎన్నికలో గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాస్తున్నారు. రాహుల్ గాంధీ వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నడు. ఎవరికి ఇచ్చారు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ దమ్ముంటే ఉద్యోగాల విషయమై చికడపల్లిలో కాదు బెంగళూరులో పెట్టు.

మీ బాండ్ పేపర్లు చిత్తు కాగితాలతో సమానం. ఉద్యమాల గడ్డ మీ మాయ మాటలు నమ్మరు ప్రజలు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. 80 సీట్లతో మంచి గెలుపు సాధిస్తాం. బీజేపీ-కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఎందుకు అమలు చేయరు..? బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే.. మీటర్లు పెట్టాలని బీజేపీ అంటే, మూడు గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ అంటది. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ఇప్పుడు రైతు బంధు అపొచ్చు కానీ, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వస్తాయి.. 6 నుంచి మనం రైతు బంధు అమలు చేసుకుందాం." అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News