Telangana CM : కొనసాగుతున్న సీఎం పంచాయితీ, సాయంత్రానికే క్లారిటీ

Telangana CM : తెలంగాణ ఎన్నికల ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అనూహ్యం విజయంతో అధికారం కైవసం చేసుకుంది. సీఎల్పీ సమావేశం ముగిసినా సీఎం ఎవరో తేలలేదు. తెలంగాణ సీఎం పంచాయితీ ఇప్పుడు ఢిల్లీలో నడుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 5, 2023, 11:25 AM IST
Telangana CM : కొనసాగుతున్న సీఎం పంచాయితీ, సాయంత్రానికే క్లారిటీ

Telangana CM : తెలంగాణలో అధికారం సాధించగలిగినా సీఎం పంచాయితీని తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీలో సీఎం సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఢిల్లీ రమ్మని పిలుపువచ్చింది. 

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఊహించినట్టే మలుపులు తిరుగుతున్నాయి. రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు వాయిదా పడ్డాయి. 64 స్థానాలు గెల్చుకుని అధికారం కైవసం చేసుకున్నా ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం విషయంలో మాత్రం ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశం సీఎం నిర్ణయించే బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినా ఆ పేరును మాత్రం తేల్చుకోలేకపోతోంది. సీఎల్పీ సమావేశం నుంచి కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు సమావేశం నుంచి బయటికెళ్లిపోయారు. 

సీఎంగా రేవంత్ రెడ్డి అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ సీనియర్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ రెడ్డికి బయట్నించి మద్దతున్నా పార్టీలో సీనియర్ల నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది. దాంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా ఏఐసీసీ పరిశీలకులు నిన్ననే ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు. సీఎం పంచాయితీ అక్కడే తేలుతుందని చెప్పారు. ఇవాళ ఉదయం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలోనే తెలంగాణ సీఎల్పీ నేత ఎవరనేది తేలనుంది. 

కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌లు ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. సీఎల్పీ నేతను ఏకాభిప్రాయంతో నిర్ణయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోంది. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు సీల్డ్ కవర్‌లో అధిష్టానానికి ఇవ్వనున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ సాయంత్రంలోగా తేలవచ్చని అంచనా. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాదని మరొకరిని సీఎం చేస్తే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదముందని పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. అదే సమయంలో సీనియర్ నేతలు అభిప్రాయాన్ని కూడా నిరాకరించజాలదు. సీఎం ఎవరనేది తేలిన తరువాతే డిప్యూటీ సీఎం, ఇతర కీలక శాఖలు ఎవరికనేది తేలనుంది. ఢిల్లీలో ఇవాళ మద్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సీఎం పంచాయితీపై కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం జరగనుంది. 

డిల్లీలో అధిష్టానం సమావేశం తరువాత సీఎం అభ్యర్ధి ఎవరనేది నిర్ణయించిన తరువాత కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం సీల్డ్ కవర్‌లోనే డీకే శివకుమార్ హైదరాబాద్ చేరుకుని తెలంగాణ సీఎం ఎవరనేది ప్రకటించనున్నారు. అంటే తెలంగాణ సీఎం ఎవరనేది తేలడానికి సాయంత్రం కావచ్చని తెలుస్తోంది. 

Also read: Kishan Reddy: రేవంత్ రెడ్డిని ఓడించి రికార్డు సృష్టించాం.. బీజేపీ ఓటమికి కారణాలు ఇవే: కిషన్ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News