Pimples Indicate Health Problems: మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే మొటిమలే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలియజేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ఈ మొటిమలు ఎందుకు ఏర్పడతాయి ? మొటిమలు రావడానికి అసలు కారణం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం.
మొటిమల అనేక ప్రదేశాల్లో వస్తు ఉంటాయి. అందులో ముఖ్యంగా ముఖంపై ఎక్కువగా వస్తాయి. అయితే వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ఉత్తమ చికిత్సను పొందడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Microwave Safe Or Not: మైక్రోవేవ్‌ను వినియోగించడం మంచిదేనా? ఇవి తప్పకుండా గుర్తుంచుకోండి..
మొటిమలు ఎక్కవగా రావడానికి కారణం మనం తీసుకోనే ఆహారం. అధిక నూనె, పిండితో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల మొటిమల ఎక్కువగా వస్తాయి. ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా ఈ రిఫ్లెక్సాలజీ ఆధారంగానే శరీర అవయవాలు, వ్యవస్థ గురించి, వాటి ఆరోగ్యం గురించి తెలియజేస్తాయని నిపుణుల పరిశోధనలో తేలింది.
నుదుటి భాగం: మొటిమలు మీ నుదుటి పైన వస్తున్నాయా.. దీనికి కారణం జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలేదని తెలుసుకోవాలి. జంక్‌ఫుడ్, కొవ్వుతో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారని మనకు తెలుస్తుంది.
కనుబొమ్మల మధ్య: ఈ ప్రదేశంలో మొటిమలు వస్తే లివర్ పనితీరు బాగా లేదని తెలుసుకోవాలి. ఆల్కహాల్, పిజ్జా, బర్గర్, చిప్స్ వంటివి మానేసి చూస్తే ఫలితం ఉంటుంది.
బుగ్గల కింది: మొటిమలు ఉంటే నోటిలో ఇన్‌ఫెక్షన్లు, దంత సంబంధ వ్యాధులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.
బుగ్గలపై: కంటి కిందగా మొటిమలు ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేయడం లేదని తెలుసుకోవాలి. పొగతాగడం, గాలి కాలుష్యం వంటి వాటి వల్ల ఇలా అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఛాతి, మెడ: మొటిమలు శరీరానికి కలిగే ఒత్తిడిని సూచిస్తాయని వైద్యులు అంటున్నారు. యోగా, ధ్యానం వంటివి రోజూ చేస్తే ఫలితం కనిపిస్తుంది.
ముక్కుపై: గుండె పనితీరు, హైబీపీ వంటి రుగ్మతలను తెలియజేస్తాయి. ఎక్కువగా వేసి వండిన ఆహారం, కొవ్వు పదార్థాలను వెంటనే మానేసి వాటికి బదులుగా నట్స్‌ను తీసుకోవాలి.
ఇలా ముఖంపై ఏర్పడే మొటిమలను బట్టి మనకు ఉన్న అనారోగ్యాల గురించి సులభంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ముందు ముందు రాకుండా ఉండాలి అంటే మీ ఆహార అల్లవాట్లును మార్చుకోవాల్సి ఉంటుంది.
Also Read: Multivitamins Benefits: మల్టీవిటమిన్ టాబ్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి