Multivitamins Benefits: మల్టీవిటమిన్ టాబ్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !

Benefits Of Multivitamin Tablets: ప్రస్తుతం కాలంలో షోషకలోపంతో చాలా మంది బాధపడుతున్నారు. శరీరానికి కావాలసిన షోషకాలు అందకపోతే.. పోషకాహారలోపం బారిన పడాల్సి ఉంటుంది. దీని కోసం చాలా మంది మల్లీవిటమిన్‌ టాబ్లెట్స్‌ను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 01:05 PM IST
Multivitamins Benefits: మల్టీవిటమిన్ టాబ్లెట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే !

Benefits Of Multivitamin Tablets: శరీరానికి విటమిన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్లు అనేది శరీరం యొక్క ప్రధాన బిల్డింగ్ బ్లాక్స్‌. దీని కారణంగా మంచి ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడతాయి. అయితే మల్టీవిటమిన్లు అంటే ఏంటి..? వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మల్టీవిటమిన్ అంటే ఏంటి?

మల్టీవిటమిన్లు సాధారణంగా ఆహారా పదార్థాలు, ఇతర నేచురల్ రిసోర్స్‌లో లభించే అనేక రకాల విటమిన్‌లు. వీటిని తీసుకోవడం కారణంగా పోషకాహారలోపం వల్ల వచ్చే సమస్యలను అధిగమిస్తుంది. మల్టీవిటమిన్‌ శరీరం లోపిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మల్టీవిటమిన్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎంటో తెలుసుకుందాం.

శక్తి పెంచడంలో సహాయపడుతుంది: పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు తరుచు నీరసంగా ఉంటారు. దీనికి కారణం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే. మల్టీవిటమిన్ టాబ్లెట్స్‌ని తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శక్తిని తిరిగి పొందడంలో సహాయపడుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: రోగనిరోధక శక్తిని పొందాలి అనుకునే వారు ప్రతిరోజు విటమిన్ ఇ, సి, డి కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ విటమిన్‌లు మల్టీవిటమిన్‌లో కూడా పుష్కలంగా లభిస్తాయి.

Also read: Hair Care Tips: ఆవనూనెలో ఈ పదార్ధాలు కలిపి రాస్తే బట్టతల మాయం, నిగనిగలాడే కేశాలు సొంతం

గుండె ఆరోగ్యంగా ఉండడంలో: మల్టీవిటమిన్ వల్ల గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గించవచ్చిన నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్ B1, B2, B6, K1, మెగ్నీషియం అన్ని గుండె ఆరోగ్యానికి  కీలక పాత్ర పోషిస్తాయి.

కంటి సమస్యలు: కంటి చూపును మెరుగుపరచడానికి విటమిన్ ఎ సహాయపడుతుంది. మల్టీవిటమిన్‌ తీసుకోవడం వల్ల కంటి చూపును మందగించకుండా ఉంటుందని చెబుతున్నారు.

మెదడు పనితీరు: విటమిన్ B12 జింగో బిలోబా వంటి హెర్బల్ సప్లిమెంట్లు కలిగి ఉంటుంది. ఒమేగా-3 మెదడు పనితీరును పునరుద్ధరించడంలో సహాయపడతాయి.

ఆరోగ్యకరమైన జుట్టు: చలికాలంలో జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. దీనికి కారణం విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ సి మరియు కొన్ని విటమిన్‌లు లోపించడం. 

Also read: Mangosteen Fruit: మాంగోస్టీన్‌ పండుతో వచ్చే ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News