Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

Corona Jn.1 Precautions: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. కరోనా కేసులు పెరగడమే కాకుండా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 27, 2023, 11:19 AM IST
Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

Corona Jn.1 Precautions: ఓ వైపు చలికాలం మరోవైపు కరోనా భయం వెంటాడుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా తగ్గిపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ ప్రారంభమైంది. దేశంలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో కొత్త వేరియంట్ జేఎన్.1 కూడా దేశంలో ప్రవేశించింది. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ 19 మార్గదర్శకాల్ని పాటించాల్సిందిగా సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 సంక్రమణను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తున్నారు. రాత్రి, ఉదయం వేళల్లో చలికాలంలో తిరిగేవారికి జేఎన్.1 త్వరగా సోకే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. చలి, మంచు కారణంగా సంక్రమణ వేగంగా ఉంటుందంటున్నారు. ఇక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, కిడ్నీ వ్యాధిగ్రస్థులు, సర్జరీలు చేయించుకున్నవాళ్లు, 60 ఏళ్లు పైబడినవాళ్లు, చిన్నారులు మంచులో ఎక్స్‌పోజ్ కావద్దని హెచ్చరిస్తున్నారు. 

వైరల్ ఇన్‌ఫెక్షన్స్ లక్షణాలు

గొంతులో దురద, గరగర ఎక్కువగా ఉండవచ్చు. జలుబు, తుమ్ములు ఎక్కువగా ఉంటాయి. పొడి దగ్గు ఉంటుంది. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, మెడనొప్పి, జ్వరం ఉంటాయి. ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ లక్షణాలు కూడా ఇలానే ఉండే అవకాశమున్నందున జాగ్రత్తగా వహించడం మంచిది.

రోజూ ప్రతి నాలుగు గంటలకోసారి గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి గార్లింగ్ చేయాల్సి ఉంటుంది. గొంతులో బీటాడిన్, పోవాడిన్, అయోడిన్ సొల్యూషన్ ప్రతి 6 గంటలకోసారి గార్లింగ్ చేయాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా నీళ్లు తాగుతుండాలి. రోజూ ఉదయం నిమ్మకాయ నీళ్లు సేవించాలి. వైరల్ లక్షణాలు కన్పిస్తే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడం మంచిది. 

ఆయిలీ ఫుడ్స్, బయటి చిరు తిండ్లు, మానేయాలి. ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి. విటమిన్ డి, విటమిన్ సి ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంచుకుని రోజుకొకటి తీసుకోవాలి. రోజూ ఉదయం వేళ సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అయ్యేట్టుండాలి. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మంచు, చలి అధికంగా ఉన్నందున చిన్న పిల్లల్ని బయటకు పంపకుండా అప్రమత్తంగా ఉండాలి.

Also read: Sapota Fruit: ప్రతిరోజు సపోటా తింటున్నారా..? అయితే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News