Jani Master Wife: జానీ మాస్టర్ భార్య పై కేసు ? తీగ లాగుతున్న పోలీసులు..

Jani Master Wife: తీగ లాగితే డొంక కదిలినట్టు.. ప్రస్తుతం జానీ మాస్టర్ ఆకృత్యాల వెనక ఆమె భార్య కూడా ప్రధాన భాగస్వామిగా ఉందని చాలా మంది బాధితులు చెబుతున్నారు. ఈ విషయమైన పోలీసులు ఈ కేసులో జానీ మాస్టర్ భార్య ఉదంతంపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 21, 2024, 11:44 AM IST
Jani Master Wife: జానీ మాస్టర్ భార్య పై కేసు ? తీగ లాగుతున్న పోలీసులు..

Jani Master Wife: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధం చేశారు. ప్రతి  మగాడి విజయం వెనక ఆడది ఉంటుందని అందరు చెబుతుంటారు. మరోవైపు ఒక మగాడి నాశనం వెనక కూడా ఆడదే ఉంటుందనే విషయం జానీ మాస్టర్ ఉదంతం విషయంలో ఈ విషయం స్పష్టమైనట్టు పోలీసులు తన ఇన్వెస్టిగేషన్ లో  సంచలన విషయాలు బయట పెడుతున్నారు. జానీ మాస్టర్ భార్య  స్వయంగా తన భర్త సుఖం కోసం ఇతర మహిళ కొరియోగ్రాఫర్స్ ను తన భర్త పశు వాంఛకు బలి చేసిందనే ఆరోపణలున్నాయి. అంతేకాదు అతని ప్రతి నేర ఆకృత్యాల వెనక ఆమె హస్తం ఉందనే విషయం వెలుగులోకి వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.  

జానీ మాస్టర్ భార్య రీసెంట్ గా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంపై జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. జానీ మాస్టర్ పై ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను గోవాలో అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో నిన్న హాజరు పరిచారు. జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. జానీ మాస్టర్‌తో పాటు ఈ కేసులో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

మొత్తంగా జానీ మాస్టర్.. సదరు బాధిత మహిళను మతం మార్చుకోమని ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. ఈమె కూడా జానీ మాస్టర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత తన మతం మార్చుకున్నట్టు హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ముఖంపై బొట్టుతో పాటు ఆమె కట్టుబాట్లన్ని ముస్లిమ్ ఆచారాల ప్రకారమే ఉన్నాయి. తను పెళ్లి చేసుకొని మతం మారినట్టు స్పష్టమైంది. ఆమె బాటలోనే సదరు లేడీ కొరియోగ్రాపర్ ను తన భర్తను పెళ్లి చేసుకునుందేకు మతం మారేలా  ఒత్తిడి చేసినట్టు ఆధారాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. జానీ మాస్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటికే ఆయన వల్ల బాధలకు గురైన వాళ్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.    

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News