ఇది స్విజర్లాండ్ కాదు.. మన బెంగళూరే!

స్విజర్లాండ్ కాదు.. మన బెంగళూరే!

Last Updated : Sep 25, 2018, 05:02 PM IST
ఇది స్విజర్లాండ్ కాదు.. మన బెంగళూరే!

పై ఫొటోలో మీరు చూస్తున్న ప్రదేశం ఏ స్విజర్లాండో.. లేక మరేదో అనుకుంటే మీరు పొరబడినట్లే! 'గార్డెన్ ఆఫ్ సీటీ', 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా' అని ప్రసిద్ధి గాంచిన బెంగళూరులోది ఈ ప్రదేశం.

ఈ ఫోటో బెల్లందూర్ సరస్సుది. బెంగళూరులో ఉన్న బెల్లందూర్ సరస్సు విష నురుగులను వెదజల్లుతోంది. మంగళవారం ఈ విషపు నురగలతో బెంగళూరు వాసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ట్రాఫిక్ చాలాసేపు జామ్ అయ్యింది.

బెంగళూరులో భారీ వర్షాలు కురిస్తే.. ఇదే పరిస్థితి. భారీ వర్షాలకు చెరువులు, సరస్సులో భారీగా నీరు వచ్చి చేరుతుంది. విపరీతమైన వ్యర్థాలు కలిసిన నీళ్లు కావడంతో ప్రవాహం కిందకు వెళ్లేప్పుడు పెద్ద ఎత్తున నురుగు పుట్టుకొచ్చింది. ఇదంతా చుట్టుపక్కల ప్రాంతాల్ని కమ్మేయగా.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే ఇది తరచూ తలెత్తే సమస్యే అయినా అధికారులు, ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడం లేదు. ఫిర్యాదులు వెళ్ళినప్పుడు మాత్రమే అధికారులు తాత్కాలిక పరిష్కారం చూపుతున్నారు.

బెంగళూరు నగరంలో బెల్లందూర్, వర్తూర్‌లు సరస్సులు విషపూరిత నురగలను వెదజల్లుతాయి. ఒక్కోసారి రోడ్లమీదకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి.  

 

 

Trending News