Deep Fried Foods: డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..

Risks Causes Of Deep Fried Foods: ప్రస్తుతం చాలా మంది ఇంటి ఆహారం కన్నా బయట అమ్ముతున్న చిరుతిండి, జంక్‌ ఫుడ్స్‌, ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తినడానికి ఇష్టపడుతున్నారు.దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో మనం ఇప్పడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2024, 10:17 PM IST
Deep Fried Foods: డీప్‌ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాలి..

Risks Causes Of Deep Fried Foods: ఆధునిక కాలంలో ఆహార అలవాట్లల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది ఫ్రైడ్‌ ఫుడ్‌ తినడంపై మొగ్గుచూపుతున్నారు. ఈ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ నూనెలో ఎక్కువగా వేయించడం వల్ల  శరీరానికి కేలరీల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ ఫ్రైడ్‌ ఫుడ్స్‌ చేయడానికి కొన్ని రకాల నూనెలు వాడుతుంటారు. దీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 

ఈ ఫ్రైడ్‌ ఫుడ్స్‌లో అధిక శాతం ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ముఖ్యంగా చికెన్‌ నగెట్స్‌,ఫ్రెంచ్‌ ఫైర్స్‌ లాంటివి చిన్నపిల్లలు తరుచుగా తింటుంటారు. దీని అతి తక్కువగా తీసుకోవడం చాలా మందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఫ్రైడ్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తినడం వల్ల అధిక బరువు సమస్య, ఊబకాయం, గుండె జబ్బులకు దారి తీయవచ్చు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల  టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కొన్ని పరిశోధనలో తేలింది.వేయించిన ఆహారాలలో హానికరమైన యాక్రిలామైడ్ ఉంటుదని నిపుణులు ఈ పదార్థాలకు దూరంగా వుండటం మంచిదని చెబుతున్నారు.

 ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీటి వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని తినకుండా ఉండడం చాలా మంచిది. దీంతో పాటు పిల్లలకు ఇవ్వకపోవడం కూడా మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News