Sania Mirza Divorce News: సానియా మీర్జా విడాకులు తీసుకుందా..? ఇన్‌స్టా పోస్టు అర్థం అదేనా..?

Sania Mirza Shoaib Malik Divorce: భారత టెన్నీస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బయోలో తన వివరాలు మార్చుకున్న సానియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌లో ఓ సంచలన వీడియోను పంచుకుంది. ఆ వీడియో చూస్తే సానియా వివాహ జీవితం ముక్కలైనట్టు కనిపిస్తోంది. భర్తతో ఆమె విడిపోయిందనే పుకార్లకు బలం చేకూరుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 09:18 PM IST
Sania Mirza Divorce News: సానియా మీర్జా విడాకులు తీసుకుందా..? ఇన్‌స్టా పోస్టు అర్థం అదేనా..?

Sania Mirza, Shoaib Malik Divorce News: భారత టెన్నీస్‌ దిగ్గజం సానియా మీర్జా తన సోషల్‌ మీడియాలో పంచుకుంటున్న విషయాలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల సామాజిక మాధ్యమాల బయోల్లో మార్పులు చేసుకున్న సానియా తాజాగా ఆమె ఇప్పుడు ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న ఓ సందేశం ఆమె వ్యక్తిగత జీవితంలో చేదు మిగిలిందని సమాచారం. భర్త షోయబ్‌ మాలిక్‌తో విడిపోయినట్లు స్పష్టమవుతోంది. తమ 14 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. 

భారత టెన్నీస్‌ దిగ్గజం సానియా మీర్జా మంగళవారం తన ఇన్‌స్టా స్టోరీలో కిందివిధంగా ఆసక్తికర పోస్టు చేసింది.

వివాహం అనేది కష్టం. విడాకులు కష్టమే
మీ కష్టమేదో ఎంచుకోండి

ఒబెసిటీ కష్టం.. ఫిట్‌ గా ఉండడం కష్టం.
మీ కష్టమేదో ఎంచుకోండి

రుణ గ్రహీతకు ఉండడం కష్టం. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కష్టం
మీ కష్టమేదో ఎంచుకోండి

సంభాషణ కష్టం. మాట్లాడకుండా ఉండడం కష్టం
మీ కష్టమేదో ఎంచుకోండి..

అంటూ ఆ సందేశం ఉంది. అనూహ్యంగా ఈ సందేశం పోస్టు చేయడం వెనుక చాలా పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. తన భర్త షోయబ్‌తో విడిపోయినట్లు సమాచారం. ఇటీవల ఆమె భర్త షోయబ్‌ తన సామాజిక మాధ్యమాల్లో బయో మార్చారు. 'అథ్లెట్‌, సూపర్‌ ఉమెన్‌ సానియా మీర్జాకు భర్త. ప్రేమకు ప్రతిరూపమైన తండ్రి' అని ఉండేది. తాజాగా అతడి బయోలో కేవలం 'ఓ భర్తకు తండ్రి' అని మారింది. ఇది మారిన రెండు రోజులకే సానియా 'కష్టం' అనే సందేశం పోస్టు చేయడం కలకలం రేపింది. 

వీరిద్దరూ విడిపోయారని చర్చ జరుగుతోంది. 2010లో వివాహం చేసుకున్న వీరికి ఓ ఇజాన్‌ మీర్జా మాలిక్‌ అనే బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత దాదాపు పదేళ్లు వీరు ఎంతో ప్రేమగా.. ఆనందంగా గడిపారు. అయితే గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు. వీరి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపాయని చర్చ నడుస్తోంది. ఇటీవల ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నారని.. బాబు మాత్రం షోయబ్‌ వద్ద ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.

చక్కగా సాగుతున్న వీరి సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపిందని కూడా ప్రచారం జరుగుతోంది. మోడల్‌ ఆయేషా ఒమర్‌ ప్రవేశించడంతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. షోయబ్‌తో ఆయేషా వివాహేతర సంబంధం కొనసాగుతుందని.. దీని కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీసిందని ఆరోపణలు వచ్చాయి. ఇవి తారస్థాయికి చేరుకోవడంతో ఇక తెగదెంపుల దాకా చేరుకుందని చర్చ నడుస్తోంది. తాజా ఇన్‌స్టా రీల్‌ కూడా అలాంటిదేనని తెలుస్తోంది. త్వరలో వారి బంధంపై ఇరువురు బహిరంగ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ

Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x