Spring Onion Benefits: ఉల్లికాడలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల శరీరం అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటుంది. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. ఉల్లికాడలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా లభిస్తాయి. దీని కారణంగా వాతావరణంలో వచ్చే జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లికాడలలోని యాంటి హిస్టమైన్ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు ఔషధంగా పని చేస్తుంది. ఉల్లికాడలలో జీవక్రియ నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.ఇది చర్మం మెరుపును పెంచుతుందని చర్మ నిపుణులు చెబుతున్నారు.
ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఏంతో మేలు చేస్తుంది. వీటిలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది.
ఉల్లికాడలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల వ్యాధుల బారిన పడకుండా సమస్యను తగ్గిస్తుంది.
ఉల్లికాడలలోని ఫొలేట్లు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి. ఉల్లికాడలలో విటమిన్ సి, విటమిన్ బి2, థయామిన్ లు అధికంగా లభిస్తాయి. ఉల్లికాడలలో కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్ ఉంటాయి.
ఉల్లికాడలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి సహాయ పడుతుంది.
ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.
లివర్‌లో పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా ఉల్లికాడలు సహాయపడుతాయి.
కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది.
లేత ఉల్లికాడలు గొప్ప రుచిని, పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి.
కెలరీలు, కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు.
ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఉల్లికాడల తీసుకోవడం వల్ల ఊబరం వంటి సమస్యలు తగ్గుతాయి.
అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ గుండె పై ప్రభావం చూపకుండా సహాయపడుతాయి.
ఈ విధంగా ఉల్లికాడలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read Facts About Castor Oil: ఇవి తెలిస్తే తప్పకుండా ఆముదం నూనెను మీరు కూడా వినియోగిస్తారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter