Monitor Lizard Enters In To The Cricket Ground: కొలంబోలో శనివారం శ్రీలంక వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ టెస్టు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అనుకోని అతిథి మైదానంలోకి ఎంటర్ అయింది. ఇప్పటి వరకు కుక్కలు, పక్షులు లేదా పాములు గ్రౌండ్ లోకి ప్రవేశించడం చూశాం. కానీ ఈసారి వచ్చింది వేరే లెవల్. దానిని చూసి అంపైర్లు, ఆటగాళ్లు ఒక్కసారిగా హడలిపోయారు. ఇంతకీ వచ్చిందెవరు అనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్దాం పదండి.
సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ అనుకోని సంఘటన జరిగింది. రెండు రోజు ఆటలో శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మానిటర్ లిజార్డ్ (ఉడుము) ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించి ఆటగాళ్లను, అంపైర్లను భయపెట్టింది. ఈ ఘటన 48వ ఓవర్ లో చోటుచేసుకుంది. దినేష్ చండిమాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ రాకాసి బల్లి బౌండరీ లైన్ వద్ద ఉన్న రోపు మీద నుంచి పిచ్ మీదకు పాకుతూ వెళ్లడాన్ని గమనించిన అంపైర్లు కాసేపు ఆట నిలిపేశారు. అయితే అది ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవతోంది.
We had an uninvited guest on the field today 🦎😄#SonySportsNetwork #SLvAFG pic.twitter.com/1LvDkLmXij
— Sony Sports Network (@SonySportsNetwk) February 3, 2024
Also Read: IND vs ENG 2nd Test: బుమ్రా దెబ్బకు కుదేలైన ఇంగ్లండ్.. భారీ ఆధిక్యం దిశగా భారత్..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 198 ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. చండిమాల్ మరియు ఏంజెలో మాథ్యూస్ శనివారం నాల్గవ వికెట్‌కు 232 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 212 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: KING COBRA Video: 12 అడుగుల గోధుమ రంగు కింగ్ కోబ్రా.. దాన్ని చూస్తే మీ గుండె ఆగిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook