KING COBRA Video: 12 అడుగుల గోధుమ రంగు కింగ్ కోబ్రా.. దాన్ని చూస్తే మీ గుండె ఆగిపోవడం పక్కా..

Viral video today: కింగ్ కోబ్రాను చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. తాజాగా ఓ భారీ కింగ్ కోబ్రా ఇంట్లోకి దూరి భీభత్సం సృష్టించిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 09:21 PM IST
KING COBRA Video: 12 అడుగుల గోధుమ రంగు కింగ్ కోబ్రా.. దాన్ని చూస్తే మీ గుండె ఆగిపోవడం పక్కా..

Huge KING COBRA rescue in Odisha: పాముల్లో అత్యంత భయంకరమైన పాము కింగ్ కోబ్రా. ఇది కాటు వేసిందంటే క్షణాల్లో ప్రాణం పోతుంది. ఇవి ఎక్కువగా పాడుబడ్డ ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాలు, వరి పొలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా 12 అడుగుల ఓ భారీ కింగ్ కోబ్రా (KING COBRA) ఓ ఇంట్లోకి దూరి అందరినీ హడలిగొట్టేసింది. ఈ భయంకరమైన స్నేక్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

ఒడిశాలోని భద్రక్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి భారీ కింగ్ కోబ్రా దూరింది. దీంతో భయభ్రాంతులకు గురైన వారు ఓ స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేసి పిలిపించారు. అక్కడకు వచ్చిన స్నేక్ క్యాచర్ గోధుమ రంగులో ఉన్న డేంజరస్ కోబ్రాను చూసి షాక్ కు గురవుతాడు. అయితే దానిని ఎంతో చాకచాక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ పామును పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. పలు మార్లు ఆ పాము బుసలు కొడుతూ అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ దాని నుండి తప్పించుకుంటాడు.  ఎన్నో ముప్పుతిప్పలు పెట్టి చివరికి అతడి చేతికి చిక్కుతోంది. తర్వాత ఆ కింగ్ కోబ్రాను సురక్షిత ప్రాంతంలో వదిలేస్తాడు స్నేక్ క్యాచర్. 

ఈ స్నేక్ వీడియోకు యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఈ మధ్య కాలంలో స్నేక్ వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా వీడియోలకు నెట్టింట మాంచి వ్యూస్ వస్తున్నాయి. 

Also Read: Viral Video: పరుగులెత్తించి.. ప్రాణాలు తీసేంత పని చేసిన గజరాజు.. ట్రెండింగ్ లో వీడియో

Also Read: Snake Viral Video: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News