Surya Grahanam 2024: త్వరలో తొలి సూర్యగ్రహణం.. ఈ 3 రాశులవారికి కష్టకాలం..

Surya Grahanam 2024: హిందూమతంలో సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది సంభవించబోయే తొలి సూర్యగ్రహణం మూడు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2024, 06:55 PM IST
Surya Grahanam 2024: త్వరలో తొలి సూర్యగ్రహణం.. ఈ 3 రాశులవారికి కష్టకాలం..

Solar eclipse 2024 effect on Zodiac Signs: ఈ సంవత్సరం చైత్ర మాసం అమావాస్య రోజున తొలి సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఇది ఏప్రిల్ 08న ఏర్పడబోతుంది. ఈసారి ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ గ్రహణం , మెక్సికో, కెనడాలోని కొన్ని ప్రాంతాలతోపాటు మెక్సికోలోని పసిఫిక్ తీరంలో కూడా ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. అయితే ఈ సూర్య గ్రహణం భారత్ లో మాత్రం కనిపించదు. అందుకే సూతక్ కాలం కూడా చెల్లదు. గ్రహణ సమయంలో పూజలు చేయడం నిషేధం. తొలి సూర్యగ్రహణం వల్ల ఏయే రాశులవారు ఇబ్బందులు పడనున్నారో తెలుసుకుందాం. 

తులా రాశి
మొదటి సూర్య గ్రహణం తులా రాశి వారికి చాలా సమస్యలను కలిగిస్తుంది. మీరు మీ కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి రావచ్చు. మీరు మానసికంగా కృంగిపోతారు. ట్రావెలింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
ఈ ఏడాది సంభవించబోయే తొలి సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి అశుభకరంగా ఉండబోతుంది. మీకు ఈ సమయం చాలా కష్టతరంగా ఉంటుంది. వ్యాపారస్తులు నష్టాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు అస్సలు కలిసిరావు.

Also Read: Solar Eclipse 2024 date: ఏప్రిల్ 08న తొలి సూర్య గ్రహణం.. ఈ 5 రాశులవారు ధనవంతులు అవ్వడం ఖాయం..

వృషభ రాశి
ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్య గ్రహణం వృషభ రాశి వారికి ప్రతికూలంగా ఉండబోతుంది. మీ దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ కుటుంబంలో గొడవలు తలెత్తుతాయి. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి అవకాశం ఉంది. 

Also read: Astrology: 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో ప్రమాదకరమైన కలయిక.. ఈ 3 రాశులకు సమస్యలు తప్పవు ఇక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News