YS Jagan Jamili Elections: మోడీ కోసం రూటు మార్చిన జగన్.. పవన్ కు చెక్ పెట్టేలా..!

YS Jagan Jamili Elections: కేంద్రంలోని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోన్న జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై ఏపీలోని టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించింది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి వైయస్ఆర్సీపీ దీనిపై మౌనం దాల్చినా.. ఓటింగ్ సమయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించిందా ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 18, 2024, 03:48 PM IST
YS Jagan Jamili Elections: మోడీ కోసం  రూటు మార్చిన జగన్.. పవన్ కు చెక్ పెట్టేలా..!

YS Jagan Jamili Elections: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ కోసం వైయస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూటు మార్చారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు. అవును  తాజాగా పార్లమెంటు వేదికగా జరిగిన జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుందా అనేది ఆసక్తికరంగా మారింది. అందుకే  జాతీయ రాజకీయాలపై వైసీపీ అధినేత జగన్ మరో ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇండి కూటమి వైపు వెళుతున్నట్లు సంకేతాలు ఇచ్చిన జగన్.. జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో రూటు మార్చారు.

లోక్ సభలో జమిలీ బిల్లుకు వైసీపీ ఎంపీలు అనూహ్యంగా మద్దతు ఇవ్వడం ఢిల్లీతో పాటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కాక జమిలి బిల్లుకు బయట మద్దతు ఇచ్చిన పార్టీ వైయస్ఆర్సీ పార్టీ ఒక్కటే. గతంలో జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండి కూటమిలోని కొన్ని పార్టీలే మద్దతు ఇచ్చాయి.

ఇండి కూటమి పగ్గాలు మమతా బెనర్జీకి ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ్ సాయి రెడ్డి చెప్పడంతో .. ఆ కూటమిలో చేరుతారనే ప్రచారం సాగింది. తాజాగా  జమిలీ ఎన్నికల బిల్లుకు మద్దతు ఇచ్చికేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర  మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు జగన్.ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదనే గ్రహించే జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే వక్ఫ్ బిల్లును వైసీపీ వ్యతిరేకించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ  రకంగా కేంద్రంలో పలు బిల్లులుకు మద్దతు ప్రకటిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News