Supreme Court Comment Over Reservations: బాబా సాహేబ్ అంబేద్కర్ మన దేశం రాజ్యంగం రచించే క్రమంలో అన్నివర్గాలు సమానంగా డెవలప్ కావాలని ఆశించారు. కానీ అప్పటికాలంలో కొన్ని వర్గాలు, మిగతా వారిని శాసిస్తూ మిగతా అన్నిరంగాల్లో ఆధిపత్యం చూపించేవి. ఈక్రమంలో రాజ్యంలో అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి, కొన్ని వర్గాల వారికి ప్రత్యేకంగా డెవలప్ అవ్వడానికి రిజర్వేషన్ లను కల్పించారు.
Read More: Red Aloevera: ఎర్రకలబంద, పచ్చకలబంద కంటే 22 రెట్లు శక్తివంతమైంది.. దీని అద్భుతప్రయోజనాలు తెలుసా?
ఈ క్రమంలోనే తాజాగా, సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్ లపై కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ లపై దాఖలన ఒక కేసులో సుప్రీంకోర్టు.. వెనుకబడిన కులాలకు చెందిన వారు అర్హులని చెబుతూనే.. ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్ల నుంచి లాభం పొందిన వారు రిజర్వ్ డ్ క్యాటగిరి నుంచి వైదొలిగి, వీరికన్న మరింత వెనుకబడినవారికి అవకాశం ఇవ్వాలన్నారు. భారత్ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనంలో బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ ఉన్నారు.
అయితే.. ఏడుగురు న్యాయమూర్తులతో ఉన్న ధర్మాసనం.. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ అండ్ ఇతరులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా అనే దానిపై వచ్చిన సూచనలను విచారించడం ప్రారంభించింది. 2004 లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు అన్ని ఒక్కటే. వీటిలో సబ్ క్యాస్ట్ లకు కూడా మినహాయింపు ఉండదన్నారు. ఈ కేసు మీద జస్టిస్ విక్రమ్ నాథ్, పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మీంగర్ సింగ్ వాదనలను కోడ్ చేస్తూ... ఎందుకు మినహయింపు ఉండదకూడదు..
మీ ఆలోచన ప్రకారం.. ఒక నిర్దిష్ట వర్గంలో.. కొన్ని ఉపకులాలు మెరుగ్గా ఉన్నాయి. ఆ కేటగిలో వారే ఫార్వర్డ్ గా ఉన్నారన్నారు. ఈ క్రమంలోనే వెనుకబడిన వారిలో మరింతగా వెనుక బడి ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని తమ వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. పంజాబ్, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు చట్టం, 2006 చెల్లుబాటుకు కూడా ఇది పరిశీలిస్తుంది. షెడ్యూల్డ్ కులాల కోటాలో.. ప్రభుత్వ ఉద్యోగాలలో వాల్మీకులు, మజాబీ సిక్కులకు 50 శాతం కోటా, మొదటి ప్రాధాన్యత అందించింది.
కానీ 2010 లో.. పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ చట్టంలోని సెక్షన్ 4 (5)ను రాజ్యంగ విరుద్ధమని చెప్పి కొట్టివేసింది. జస్టిస్ నాథ్ వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. రిజర్వ్ డ్ కేటగిరీలోనరి ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ అధికారుల పిల్లలు రిజర్వేషన్ ప్రయోజనాలున పొందటం కూడా చర్చజరిగింది.
Read More: Ketika Sharma: లేటెస్ట్ ఫోటోషూట్‌లో సెగలు పుట్టిస్తోన్న కేతిక శర్మ.. ఇది మాములు డోస్ కాదండోయ్..
ఉన్నత స్థాయి అధికారుల పిల్లలు గ్రామాల్లో నివసించే వర్గానికి ప్రతికూలతలు ఉండవు. ఇలా రిజర్వేషన్ లు తరతరాలుగా కొనసాగుతుంటాయని వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా.. జర్నైల్ సింగ్ వర్సెస్ లచ్చి నారయణ గుప్తా కేసులో కూడా.. సుప్రీం ధర్మాసనం.. ఎస్సీ, ఎస్టీలకు కూడా క్రిమిలేయర్ వర్తిస్తుందని తెలిపింది. 2018 తీర్పులో.. సర్కారు ఉద్యోగాల్లో ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ లను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook