Pakistan Election Results: పాకిస్థాన్ పార్లమెంట్‌లో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వీటిలో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 70 స్థానాలకు మైనార్టీలు, మహిళకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి అకస్మాత్తుగా చనిపోవడంతో 265 సీట్లకు ఎన్నికలు జరిపారు. ఫిబ్రవరి 8వ తేదీన ఉద్రిక్తతల నడుమ జరిగిన ఎన్నికల్లో ప్రజలు భారీగానే ఓటేశారు. రెండు రోజుల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టారు. సుదీర్ఘంగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు చెందిన 'పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అత్యధికంగా 101 స్థానాలను గెలుపొందింది. మాజీ ప్రధాన నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్‌ఎన్) పార్టీకి 75 స్థానాలు వచ్చాయి. బిలావర్ జర్దారీ భుట్టోకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 సీట్లు దక్కాయి. ఎంక్యూఎం-పీ పార్టీకి 17 సీట్లు రాగా, మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు గెలిచాయి.
ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. 265 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పడాలంటే 133 స్థానాలు కావాల్సి ఉంది. అయితే ఏ పార్టీకి మెజార్టీ మార్క్ రాకపోవడంతో పాకిస్థాన్‌లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. అత్యధిక స్థానాలు గెలుపొందిన ఇమ్రాన్ ఖాన్ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. పీటీఐతో కలిసి పీఎంఎల్-ఎన్, పీపీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ మినహా మిగతా పార్టీలన్నిటితో కలిపి ప్రభుత్వం ఏర్పాటుచేద్దామని పిలుపునిచ్చారు.
Also Read: Pakistan: సార్వత్రిక ఎన్నికల ముందు షాకింగ్.. పాక్ లో వరుసగా భారీ పేలుళ్లు.. 20 కి పైగా మరణాలు..
ఎన్నికలు జరిగినా కూడా మరోసారి సైన్యం ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టింది. నవాజ్ షరీఫ్‌కు చెందిన పార్టీకి ఆ దేశ సైన్య అధ్యక్షుడు ఆసీమ్ మునీర్ మద్దతు ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అతడు పిలుపునిచ్చాడు. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా సైన్య అధ్యక్షుడు అడుగులు వేయడం మరోసారి కలకలం రేపుతోంది.
ఎన్నికల ఫలితాలు
ఎన్నికలు జరిగిన మొత్తం స్థానాలు 265
పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ): 101 స్థానాలు
పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్‌ఎన్) పార్టీ: 75 స్థానాలు
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ): 54 సీట్లు
ఎంక్యూఎం-పీ పార్టీ: 17 స్థానాలు
ఇతరులు: 37 స్థానాలు
ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ: 133 స్థానాలు
వివిధ కేసుల్లో జైలుకెళ్లిన ఇమ్రాన్ ఖాన్‌కు ఇటీవల బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఆయన జైలు నుంచి బయటకు వస్తే మరోసారి ప్రధానమంత్రి పదవిని అధిష్టించనున్నాడు. 101 స్థానాలకు తోడు పీపీపీని కలుపుకుని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇమ్రాన్ ఖాన్ వచ్చాకే ప్రభుత్వ ఏర్పాటుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook