Honor X9B Smartphone: హానర్ నుంచి శక్తివంతమైన ఫోన్, 108 మెగాపిక్సెల్ కెమేరా, 8 జీబీ ర్యామ్ ధర, ఫీచర్లు ఇలా

Honor X9B Smartphone: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ సంస్థ కొత్త Honor X9B 5G స్మార్ట్‌ఫోన్ ఇవాళ ఇండియాలో లాంచ్ కానుంది. స్మార్ట్ ఫోన్‌తో పాటు హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్, హానర్ ఛాయిస్ వాచ్ కూడా విడుదల కానున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2024, 10:22 AM IST
Honor X9B Smartphone: హానర్ నుంచి శక్తివంతమైన ఫోన్, 108 మెగాపిక్సెల్ కెమేరా, 8 జీబీ ర్యామ్ ధర, ఫీచర్లు ఇలా

Honor X9B Smartphone: Huaweiకు చెందిన హానర్ సంస్థ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విస్తరిస్తోంది. ఇప్పుడు తాజాగా Honor X9B 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమేరా, లాంగ్ బ్యాటరీ, 8జీబీ ర్యామ్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతగా ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారీ వాటా కలిగిన చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో ఒకటి Huaweiకు చెందిన Honor.ఈ కంపెనీ భారతదేశ మార్కెట్‌లో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా Honor X9B 5G స్మార్ట్‌ఫోన్ ఇవాళ అంటే్ ఫిబ్రవరి 15న లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్‌లో మొట్టమొదటిసారిగా అల్ట్రా బౌన్స్ డ్రాప్ డిస్‌ప్లే టెక్నాలజీ ప్రవేశపెట్టారు. అంటే్ దాదాపు 1.5 మీటర్ల ఎత్తు నుంచి కిందపడినా ఫోన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. Honor X9B స్మార్ట్‌ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఫోన్ కొనుగోలు చేసిన 6 నెలల్లో స్క్రీన్‌కు ఎలాంటి డ్యామేజ్ జరిగినా ఫ్రీ రీప్లేస్‌మెంట్ ఉంటుంది. 

Honor X9B 5G స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచెస్ 1.5 కే రిజల్యూషన్ డిస్‌ప్లే కలిగి ఉండి 120 హెర్ట్జ్ రిఫ్రెష్‌రేట్‌తో అందుబాటులో వస్తోంది. స్నాప్ డ్రాగన్ 6వ జనరేషన్ 1 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ వరకూ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సరికొత్త మేజిక్ టెక్స్ట్ ఫీచర్ ద్వారా పోటో నుంచి టెక్స్ట్ పొందవచ్చు. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే మార్కెట్‌లో లభించే అన్ని స్మార్ట్‌ఫోన్ల కంటే అత్యధికంగా 5800 ఎంఏహెచ్ సామర్ధ్యంతో వస్తోంది. ఇందులో మిడ్ సైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్, ప్రాస్టెడ్ గ్లాస్ బ్లాక్ రంగులు ఉన్నాయి. ఈ ఫోన్ వెనుకవైపు వెగాన్ లెదర్ ప్యానెల్ ఉంటుంది. 

ఇవాళ లాంచ్ కానున్న హానర్ ఎక్స్ 9బితో పాటు హానర్ ఛాయిస్ ఇయర్‌బడ్స్  ఎక్స్ 5 కూడా ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్ 3 ఓడీబీ వరకూ యాక్టివ్ వాయిస్ క్యాన్సిలేషన్ కలిగి ఉంటాయి. 35 గంటల గరిష్ట బ్యాటరీ లైఫ్ ఉంటుంది. హారన్ ఏఐ స్పేస్ యాప్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇక హానర్ ఛాయిస్ వాచ్ 1.95 అంగుళాల ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో ఇన్‌బిల్డ్‌గా జీపీఎస్ ఫీచర్ ఉంటుంది. ఇందులో ఉండే హెల్త్ యాప్ అదనపు ఆకర్షణ.

Honor X9B స్మార్ట్ ఫోన్ ధర 28,990 రూపాయల్నించి అందుబాటులో ఉంది ఆమెజాన్ ఈ కామర్స్ వేదికపై విక్రయాలు ప్రారంభమయ్యాయి. 

Also read: Bollywood: చడీచప్పుడు లేకుండా ఓటీటీలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News